Oct 17 2021 @ 12:23PM

అలయ్ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, మంచు విష్ణు

ప్రతీ ఏడాది దసరా సందర్భంగా హైద్రాబాద్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి జలవిహార్ లో ఏర్పాటు చేసిన  ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఏర్పాటు చేశారు. అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,  తెలంగాణ గవర్నర్ తమిళిసై, హోం మంత్రి మహమూద్ ఆలీతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అతిథులుగా విచ్చేశారు. మంచు విష్ణు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా.. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ విచ్చేసినట్టు రివీల్ చేస్తూ.. ఆయన కనిపిస్తున్న ఒక వీడియోను పోస్ట్ చేశారు.