Abn logo
Apr 2 2020 @ 17:17PM

ప‌వ‌న్ 27 చిత్రానికి టైటిల్ రిజిస్టర్ చేశారట

Kaakateeya

‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత ఇక సినిమాలు చేయను అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పొలిటికల్ బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికలలో అనూహ్యంగా ఆయన, ఆయన పార్టీ పరాజయం పొందడంతో తిరిగి మళ్లీ సినిమాలలోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. ఆయన రీ ఎంట్రీ అనగానే ఒకటి కాదు వరుసగా మూడు సినిమాల ప్రకటనలు జరిగిపోయాయి. పవన్ 26వ చిత్రంగా ‘వకీల్ సాబ్’ చివరి దశలో ఉండగా.. కరోనాతో షూటింగ్‌లు ఆగిపోవడంతో మిగతా బ్యాలెన్స్ షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇక ఈ చిత్రంతో పాటు మరో చిత్రం కూడా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.


క్రిష్ దర్శకత్వంలో పవన్ 27వ చిత్రం మొదటి షెడ్యూల్ జరుపుకుంది. పీరియాడిక్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ దొంగ పాత్రలో నటిస్తాడనే టాక్ నడుస్తుంది. కోహినూర్ వజ్రం దొంగలించే నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ క్రిష్ ఓ టైటిల్‌ని రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ‘విరూపాక్ష’ టైటిల్‌నే పవన్ సినిమా కోసం క్రిష్ ఫిల్మ్‌ఛాంబర్ నందు రిజిస్టర్ చేయించారని అంటున్నారు. అయితే అధికారికంగా చిత్రయూనిట్ మాత్రం ప్రకటించలేదు.

Advertisement
Advertisement
Advertisement