Abn logo
Jun 6 2020 @ 22:13PM

‘వకీల్‌సాబ్‌’.. మంచి నిర్ణయం తీసుకున్నారు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఫిల్మ్ ‘వకీల్‌సాబ్’ చిత్రం విషయంలో నిర్మాత దిల్ రాజు హీరో పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు జరిపి ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మూవీని ఇప్పుడప్పుడే షూట్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇంకా ఈ సినిమాకి సంబంధించి 35 రోజుల పాటు షూటింగ్ జరపాల్సి ఉందట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదనే నిర్ణయానికి వారిద్దరూ వచ్చినట్లుగా టాక్.


షూటింగ్స్‌కు అనుమతి వచ్చినా.. థియేటర్స్ ఇప్పుడప్పుడే తెరిచే అవకాశం లేదు. అందుకే తొందరపడకుండా నిదానంగా అన్నీ చూసుకునే షూటింగ్ స్టార్ట్ చేయాలని వారు నిర్ణయించుకున్నారట. ఒకవేళ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసినా నిర్మాత మనీ ఖర్చు పెట్టడమే కానీ, థియేటర్‌లోకి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అందువల్ల నిర్మాతకు చాలా లాస్ వచ్చే అవకాశం ఉంది. అందుకే థియేటర్స్‌లో నార్మల్ పరిస్థితులు ఏర్పడే వరకు షూటింగ్ చేయకూడదని, ఆ తర్వాత పరిస్థితులన్నీ గమనించి అప్పుడు ఫైనల్‌గా డెసిషన్ తీసుకోవాలని పవన్ సూచించినట్లుగా తెలుస్తుంది. దీనికి దిల్ రాజు కూడా ఓకే చెప్పారని అంటున్నారు. 


మొత్తంగా చూస్తే మాత్రం ఇది చాలా మంచి నిర్ణయం అని అంటున్నారు. ఎందుకంటే పవన్ సినిమా అనగానే థియేటర్స్‌లోకి ప్రేక్షకులు భారీగా వస్తారు. అందులో డౌటే లేదు. అప్పుడు కరోనా మరింతగా వ్యాపించే అవకాశం ఉంది. ఒకవేళ కరోనాకి భయపడి ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకుంటే.. చిత్ర నిర్మాతలు నష్టపోతారు. అందుకే ఆచితూచి అడుగేయాలని వారు తీసుకున్న నిర్ణయం సరి అయినదే అని టాలీవుడ్ సర్కిల్స్‌లో అనుకుంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement