Oct 17 2021 @ 15:58PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవర్ స్టార్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు’ సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. దీని తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సందేశాత్మక చిత్రంలో నటించబోతున్నారు. ఇంకా మరికొందరు టాప్ మోస్ట్ దర్శకులు పవర్ స్టార్ తో తమ తమ సినిమాలు సెట్ చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొందరు దర్శకులు ఆయన అపాయింట్ మెంట్ కోసం క్యూలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అజేయ దర్శకుల్లో ఒకరైన అనిల్ రావిపూడి రీసెంట్ గా పవర్ స్టార్ కి కథ వినిపించారని, దానికి పవన్ బాగా ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో స్పీడ్ మీదున్నారు కాబట్టి.. ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్ళడానికి మరికొంత టైమ్ పట్టవచ్చు అని టాక్. 



కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో తన మార్కు చూపిస్తున్న అనిల్.. పవర్ స్టార్ తో కూడా ఓ కామెడీ కాన్సెప్ట్ రెడీ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ కామెడీ ఎంటర్ టైనర్స్ లో నటించి చాలా కాలమైపోయింది. అందుకే అనిల్ రావిపూడి తో సినిమాను ఓకే చేశారని సమాచారం. ప్రస్తుతం ‘ఎఫ్3’ మూవీతో బిజీగా ఉన్న అనిల్ దీని తర్వాత ఓ స్టార్ హీరోతోనూ, అలాగే మహేశ్ బాబుతోనూ  సినిమాలు తీయబోతున్నారు. అవి కంప్లీట్ అయ్యాకా పవర్ స్టార్ సినిమాకి షిప్ట్ అవుతారట అనిల్. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో చూడాలి.