Abn logo
May 17 2020 @ 14:53PM

ఎన్టీఆర్ నో చెబితే.. ప‌వ‌న్ ఎస్ అన్నాడా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘గ‌బ్బ‌ర్‌సింగ్’ త‌ర్వాత మ‌రో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని హ‌రీశ్ శంక‌ర్ అధికారికంగా తెలియ‌జేశాడు. ఈ సినిమాపై ప‌లు రకాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా  మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. ఓ లైన్‌ను ఎన్టీఆర్‌కు వినిపిస్తే ఆయ‌న నో చెప్పేశాడ‌ట‌. అదే లైన్‌ను ప‌వ‌న్ ఓకే చేశాడ‌ట‌. మ‌రి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హ‌రీశ్ శంక‌ర్ ఈ వార్త‌ల‌పై ఏమ‌ని స్పందిస్తాడో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement