అమరావతి : నిత్య చైతన్య మూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. నేడు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పవన్ ఆయనను స్మరించుకున్నారు. ‘‘నేను ఆరాధించే గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్. రాజ్యాంగంలో ఆయన కల్పించిన పౌర హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రజలకు రక్షణగా నిలుస్తున్నాయి. అంబేద్కర్ గారు చూపిన మార్గంలోనే జనసేన ప్రస్థానం కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు.