Abn logo
Apr 7 2020 @ 17:01PM

క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత పింక్ సినిమా రీమేక్ వ‌కీల్ సాబ్‌తో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాలు కాకుండా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ప‌వ‌న్ సినిమా చేస్తార‌ని వార్త‌లు విన‌పడుతున్నాయి. లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఓ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ రూపొందించేలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. ఇంత‌కు ఆ క్రేజీ కాంబో ఎవ‌రిదో తెలుసా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ర‌వితేజ‌ల‌ది. ఈ సినిమాను డైరెక్ట‌ర్ బాబీ తెర‌కెక్కించేలా అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. మ‌రి ఈ ప్రాజెక్ట్ ఎంత వ‌ర‌కు వెళుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement