Abn logo
Jan 18 2021 @ 15:48PM

క్రేజీ అప్‌డేట్: పవన్, చరణ్‌తో శంకర్ భారీ మల్టీస్టారర్?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించబోతున్నారా? దక్షిణాది అగ్రశ్రేణి దర్శకుడు శంకర్ భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారా? ఇప్పుడు ఇదే వార్త సంచలనంగా మారింది. పవన్, చరణ్‌లతో స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశారని,  ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు కూడా సిద్ధమైందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 


ఈ సినిమాలో చరణ్ హీరో కాగా, పవన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. పవన్ ఒకసారి ఫైనల్ వెర్షన్ స్క్రిప్టు చదివి ఓకే చెబితే వచ్చే ఏడాదే ఈ సినిమా పట్టాలెక్కుతుందట. గ్రాఫిక్స్ నేపథ్యంలో కాకుండా 1990ల్లో శంకర్ తీసిన ఎమోషనల్ కంటెంట్ బేస్డ్ సినిమాల తరహాలో ఇది రూపొందనుందట. ఈ సినిమా కోసమే చెర్రీ `ఆర్ఆర్ఆర్` తర్వాతే మరో సినిమాకు కమిట్ కాలేదట. ఇదే కనుక నిజమైతే `ఆర్ఆర్ఆర్` తర్వాత దక్షిణాదిన తెరకెక్కే భారీ మల్టీస్టారర్‌గా ఈ చిత్రం నిలువనుంది. 


Advertisement
Advertisement
Advertisement