జిల్లా పర్యటనకు పవన్‌

ABN , First Publish Date - 2020-11-29T05:30:00+05:30 IST

జిలాల్లో నివార్‌ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను, రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు రోజుల్లో జిల్లాలో పర్యటిస్తారని జనసేన నేతలు తెలిపారు.

జిల్లా పర్యటనకు పవన్‌

టెలీకాన్ఫరెన్స్‌లో జనసేనాని స్పష్టం

నేడు వివరాలు ప్రకటించే అవకాశం

వరదపై పూర్తి సమాచారం ఇచ్చిన కేతంరెడ్డి


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)నవంబరు 29: జిలాల్లో నివార్‌ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను, రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు రోజుల్లో జిల్లాలో పర్యటిస్తారని జనసేన నేతలు తెలిపారు. ఆదివారం జిల్లా జనసేన నేతలతో పవన్‌ కళ్యాణ్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో వరద పరిస్థితి ఏమిటి.. ఎంతమంది రైతులు నష్టపోయారు..? సోమశిల నీటి విడుదల.. ఇలా పలు అంశాల గురించి పవన్‌కళ్యాణ్‌ జిల్లా నేతలను అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజుల్లో జిల్లా పర్యటనకు వస్తానని, పూర్తి వివరాలు వెల్లడిస్తానని పవన్‌ తెలిపినట్లు సమాచారం. నెల్లూరు నగర నియోజకవర్గ జనసేన నాయకుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆదివారం నగరంలోని పెన్నా బ్యారేజి ప్రాంతాన్ని సందర్శించి నదిలో వరద తీరును పరిశీలించారు. జిల్లాలోని వరద పరిస్థితులను క్షుణ్ణంగా టెలీకాన్ఫరెన్స్‌లో పవన్‌కళ్యాణ్‌కు వివరించారు. ఈ సందర్భంగా వినోద్‌రెడ్డి మాట్లాడుతూ పెన్నాకు తీవ్ర వరద రావడానికి, నెల్లూరు నగరం నీట మునగడానికి నివార్‌ తుఫాను కారణం కాదని, సోమశిల రిజర్వాయర్‌ నిర్వహణ లోపమే ప్రధాన కారణమన్నారు. జలవనరుల శాఖ తీరు, వైఫల్యాలను ఆధారాలతో సహా జనసేన పార్టీ అధ్యక్షుడికి వివరించామన్నారు.  కార్యక్రమంలో  జనసేన పార్టీ నేతలు పావుజెన్ని చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌ యాదవ్‌, హేమంత్‌, కుక్కా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:30:00+05:30 IST