TMC : తృణమూల్ కాంగ్రెస్‌కి మాజీ ఎంపీ పవన్ వర్మ రాజీనామా

ABN , First Publish Date - 2022-08-12T20:52:08+05:30 IST

రాజ్యసభ(Rajyasabha) మాజీ ఎంపీ కే.పవన్ వర్మ (Pavan K.Varma) ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(AITC)కి రాజీనామా చేశారు.

TMC : తృణమూల్ కాంగ్రెస్‌కి మాజీ ఎంపీ పవన్ వర్మ రాజీనామా

కోల్‌కతా : రాజ్యసభ(Rajyasabha) మాజీ ఎంపీ కే.పవన్ వర్మ (Pavan K.Varma) ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్  పార్టీ(AITC)కి రాజీనామా చేశారు. తన రాజీనామాను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి అందజేశారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఆత్మీయ స్వాగతం పలికి అప్యాయత, మర్యాదులు చూపించారంటూ మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. రాజీనామాను ఆమోదించాలని విన్నవించారు. అందుబాటులో ఉంటానని చెప్పారు. అయితే రాజీనామాలకు గల కారణాలను వెల్లడించలేదు.


కాగా కే.పవన్ వర్మ దౌత్యవేత్తగా దేశానికి సేవలు అందించారు. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా పలు దేశాల్లో భారత రాయబారిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గతంలో జేడీయూ తరుపున పనిచేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌(Nitish kumar)కి సలహాదారుగా పనిచేశారు. పలు కీలక నిర్ణయాల్లో పవన్ వర్మ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత నవంబర్ 2021లోనే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.  పలు పుస్తకాలు కూడా రాశారు. 12కి పైగా పుస్తకాలు మార్కెట్‌లో చక్కగా అమ్ముడయ్యాయి. అంతేకాదు భూటాన్‌ అందించే అత్యున్నత పౌరపురస్కారం ‘డ్రుక్ తుక్సే అవార్డ్’ కూడా ఆయన స్వీకరించారు. 



Updated Date - 2022-08-12T20:52:08+05:30 IST