ఫౌల్ర్టీ రైతు కుదేలు

ABN , First Publish Date - 2022-05-27T05:15:53+05:30 IST

పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు.. ఇంటి గ్రేటెడ్‌ విధానం వల్ల వస్తున్న నష్టాలతో ఫౌల్ర్టీ రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు.

ఫౌల్ర్టీ రైతు కుదేలు
చిక్స్‌ తీసుకోకుండా కొత్తకోట మండలం పాలెంలో ఖాళీగా ఉంచిన ఫౌల్ర్టీఫాం


- ఇంటిగ్రేటెడ్‌ విధానంతో ఇబ్బంది పడుతున్న  రైతులు

- గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో నష్టపోతున్నామని ఆందోళన

- కిలోకు రూ. 12 ఇవ్వాలని డిమాండ్‌

- పెరిగిన ఖర్చులతో సతమతం

- మే 1 నుంచి కంపెనీల ద్వారా చిక్స్‌ తీసుకోకుండా నిరసన

- భవిష్యత్‌లో చికెన్‌ ధరలు మరింత పెరిగే పరిస్థితి

వనపర్తి, మే 26 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు.. ఇంటి గ్రేటెడ్‌ విధానం వల్ల వస్తున్న నష్టాలతో ఫౌల్ర్టీ రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా మంది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం, ఆస్తులను ఆమ్మేసి కోళ్ల ఫారాలు మొదలు పెట్టారు. మొదట్లో సొంతంగా కోళ్లను పెంచుకోవడం, మార్కెటింగ్‌   చేసుకోవడం వల్ల  కొంత లాభసాటిగా ఉండేది.  కొద్దికాలంగా ఫౌల్ర్టీ రైతులు ఇంటిగ్రేటెడ్‌ విధానంలోకి మారిపోయారు. కొంతమందిని మినహాయిస్తే.. మె జా రిటీ రైతులు ఈ విధానం ద్వారానే కోళ్లను పెంచుతున్నారు. ఫౌల్ర్టీ రైతుకు కావాల్సిన చిక్స్‌ (కోడిపిల్లలు), దాణా, సూపర్‌వైజింగ్‌, మందులు తది తరాలు కంపెనీలు సరఫరా చేస్తాయి. కోళ్లను పెంచిన తర్వాత ఒక్కో కిలోకు ఇంత మొత్తం అంటూ కంపెనీలు గ్రోయింగ్‌ చార్జీల రూపంలో రైతులకు చెల్లిస్తా యి. ఒకవేళ కోళ్లకు నిర్దేశిత మొత్తం దాణా కంటే ఎక్కువ ఫీడ్‌ చేసినా.. ఎక్కువ మందులు అవసరమై నా.. కోళ్లు సరిగా ఎద గకపోయినా ఆ నష్టాన్ని రైతులే భరించాల్సి వస్తోంది. దీనికితోడు లెక్కలు అన్నీ పోను గ్రోయింగ్‌ చార్జీలకు గాను రైతులకు సదరు కంపెనీలు కేవలం కిలోకు రూ. 4.50 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో చికెన్‌ ధర రూ. 280 నుంచి రూ. 300 వరకు ఉన్నా రైతులకు కేవలం రూ. 4.50 చొప్పున మిన హాయిస్తే రైతులకు వచ్చేది శూన్యం. ఈ విధానం మొదట్లో సరిగానే చార్జీలు ఇచ్చిన కంపెనీలు.. ప్రస్తుతం ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పేపర్‌, గొగ్గు దొరకక పోవడం, మార్కెట్‌ విలువ భారీగా పెరగడం, షెడ్డు మెయిం టనెన్స్‌, విద్యుత్‌, నీటి సరఫరా ఖర్చులు విపరీతంగా పెరగడంతో కంపెనీలు ఇచ్చే ధరలు సరిపోవడం లేదు. 

ఉమ్మడి జిల్లాలో 1,600 మందికి  పైగా ఫౌల్ర్టీ రైతులు 

ఉమ్మడి జిల్లాలో సుమారు 1,600మందిరి పైగా ఫౌల్ర్టీలు ఉ న్నాయి.   ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఈ రంగంపై వేల సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. ఇంటిగ్రేటెడ్‌ విధానంలో కోడిపిల్ల వచ్చి నప్పటి నుంచి కోళ్లను లిఫ్టింగ్‌ చేసే వరకు శ్రమంతా రైతులే పడుతున్నారు. కోళ్ల ఫారాల దగ్గర లేబర్‌ ఖర్చు, వ్యాక్సినేషన్‌ ఖర్చు, కరెంటు బిల్లు తదిత రాలు రైతులే భరిస్తున్నారు. కంపెనీలకు కోడిపిల్లకు రూ. 34, దాణా కిలోకు రూ. 47, అడ్మినిస్ర్టేషన్‌ చార్జీల పేరిట ఒక్కో కోడిపిల్లకు రూ. 6 చొప్పున ఖర్చు రాసి కంపెనీలు లెక్కలు వేస్తున్నాయి. సంస్థ పెట్టిన ఖర్చులన్నీ తీస్తే.. కేజీ కోడి తయారు కావడానికి ఖర్చు రూ. 95కు మించరాదు. అలా అయితే రైతు కు రూ. 5.80 చొప్పున కంపెనీలు చెల్లిస్తాయి. కానీ దాణా, ఇతర ఖర్చులు ఎక్కువైనా కంపెనీలు భరించవు.. పెట్టిన పెట్టుబడికి, చేస్తున్న ఖర్చుకు పోలిక లేకుండా కంపెనీలు గ్రోయింగ్‌ చార్జీలు చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  

చిక్స్‌ దిగుమతి బంద్‌ 

ఇంటిగ్రేటెడ్‌ విధానంలో తీవ్రంగా నష్టపోతున్న ఫౌల్ర్టీ రైతులు.. తమకు గిట్టుబాటు చార్జీలు ఇవ్వాలని కంపెనీలను కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కూడా కొంతమంది ఫౌల్ర్టీ రైతులు తమకు గిట్టుబాటు ధర చెల్లించకపోతే చిక్స్‌ దిగుమతి చేసుకోబోమని గతంలోనే లేఖలు రాశారు.  కంపెనీల నుంచి స్పందన లేకపోవడంతో చేసేదేమి లేక కొందరు ఫౌల్ర్టీలను బంద్‌ చేస్తుండగా.. మరికొందరు చిక్స్‌ దిగుమతి చేసుకోకుండా తమ నిరసనను తెలుపుతున్నారు.  నెలరోజులుగా రైతులు చిక్స్‌ దిగుమతి చేసుకోవడం లేదు. కొందరు కంపెనీల నుంచి వచ్చిన చిక్స్‌ను వాపస్‌ పంపిస్తున్నారు.  గ్రోయింగ్‌ చార్జీలు సగటున కిలోకు రూ. 10 నుంచి రూ. 12 ఇవ్వాలని, బ్యాచ్‌ ఫెయిల్‌ అయిన రైతులకు కనీసం కిలోకు రూ. 8చొప్పున చెల్లించాలని. ప్రతీ బ్యాచ్‌కు 70శాతం మేల్‌ చిక్స్‌, 30శాతం ఫీమేల్‌ చిక్స్‌ సరఫరా చేయాలని.  అనుభవం కలిగిన సూపర్‌వైజర్లను నియమించా లని. లిఫ్టింగ్‌ను 40 నుంచి 45 రోజుల్లోపు పూర్తిచేయాలనే తదితర డిమాండ్లను కంపెనీ యజమానుల ఎదుట ఉంచుతున్నారు. ఫామ్‌ రేట్‌ రూ. 110 మించితే ఆ తర్వాత వచ్చే లాభంలో రైతుకు 50శాతం చెల్లించాలి. వేసవిలో నిర్వహణ ఖర్చులు ఎక్కు వగా ఉంటాయి కాబట్టి సీజన్‌లో కోడికి రూ.2 అదనంగా చెల్లించాలని ఇంటిగ్రేటెడ్‌ ఫౌల్ర్టీ యూనియన్‌ నేతలు కోరుతున్నారు.  


 

Updated Date - 2022-05-27T05:15:53+05:30 IST