పట్టుబడ్డ గంజాయి దహనం

ABN , First Publish Date - 2022-07-06T06:51:51+05:30 IST

పట్టుబడ్డ గంజాయి దహనం

పట్టుబడ్డ గంజాయి దహనం
గంజాయిని తగులబెడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

గన్నవరం, జూలై 5 : అక్రమంగా గంజాయి, మద్యం తరలించడం నేరమని అవి తరలించేటప్పుడు పట్టుపడితే కఠిన శిక్షలు తప్పవని కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారు లు, ఆస్మాఫర్హిన్‌, మేకా సత్తిబాబు అన్నారు. మంగళ వారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో గత మూడు నెలల్లో అక్రమంగా స్వాధీనం చేసుకున్న రూ. 20 లక్షల విలువ చేసే గంజాయిని గొల్లనప్పల్లి శివారు కొండల్లో తగులబెట్టారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి విక్రయించినా సేవిం చినా నేరమన్నారు. గంజాయి అక్రమ తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ టి. శ్రీనివాసరావు, సీఐ వరాలరాజు, ఎస్సై శాస్ర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T06:51:51+05:30 IST