Abn logo
Jul 26 2021 @ 23:03PM

సాగులో ఉన్న దళితులకు పట్టాలివ్వాలి

ధర్నా చేస్తున్న కేవీపీఎస్‌ నాయకులు, రైతులు

వికారాబాద్‌: సాగులో ఉన్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి మహిపాల్‌ అన్నారు. సోమవారం కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం  ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధారూరు మండలం కెరెళ్లి గ్రామంలోని 39, 40 సర్వేనంబర్లలోని 75 ఎకరాల భూమిలో సుమారు వందేళ్లులుగా దళితులు, బలహీన వర్గాల ప్రజలు సాగులో ఉన్నారని, వారికి కొత్త పాస్‌పుస్తకాలు లేవని అన్నారు. కొత్తపా్‌సపుస్తకాలు ఇచ్చి కెరెళ్లి, ఎబ్బనూరు, జిన్నారం రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, రాజు, రవి, శ్రీనివాస్‌, మల్లయ్య, హనుమయ్య, నర్సింలు, అంజయ్య, రాములు, వెంటయ్య పాల్గొన్నారు.