గాంధీ ప్రభావితుడు పట్టాభిసీతారామయ్య

ABN , First Publish Date - 2022-08-10T05:44:17+05:30 IST

గాంధీ ప్రభావితుడు పట్టాభిసీతారామయ్య

గాంధీ ప్రభావితుడు పట్టాభిసీతారామయ్య

స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్ర


ఏలూరుసిటీ, ఆగస్టు 9: స్వాతంత్రోద్యమంలో ఉద్యమ స్ఫూర్తినందించి సమరయోధులకు చురుకైన, ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకరు. ఈయన 1880 నవంబర్‌ 24న మద్రాసు ప్రెసిడెన్సీ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా (పశ్చిమ గోదావరి జిల్లా గుండు గొలను)లో భోగరాజు వెంకట సుబ్రహ్మణ్యం, గంగమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుం బంలో జన్మించిన పట్టాభి సీతారామయ్యకు అన్న, ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వారి ఇంట్లో ప్రతి ఏటా రామపట్టాభిషేకం జరపడం ఆచారం. అందుకే ఆయనకు పట్ఠాభిసీతారామయ్య అని నామకరణం చేశారు. ఈయన తండ్రి సుబ్రహ్మణ్యం గుండు గొలను గ్రామ కరణంగా పనిచేశారు. ఇతని నాల్గో ఏటనే తండ్రి మరణించటంతో కుటుంబ భారం తల్లి గంగమ్మ మీద పడింది. దీంతో పిల్లల విద్యాభాస్యం కోసం ఆమె తన కుటుంబాన్ని ఏలూరుకు తరలిం చింది. ఆ సమయంలో భారత జాతీయోద్యమంలో గాంధీజీచే ప్రభావితుడై పట్టాభిసీతారామయ్య ఉద్య మంలో చేరి ఆయనకు సన్నిహితుడయ్యాడు. అంతే కాకుండా కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం పొందారు. 1939 లక్ష గాంధీజీ తరపున అభ్యర్థ్ధిగా కాంగ్రెస్‌ అధ్య క్ష పదవికి పోటీచేసి నేతాజీ చేతిలో ఓడిపోయినా...  ఆ తర్వాత 1948లో పురుషోత్తమ దాస్‌ టాండన్‌ పై విజయం సాధించారు. అనంతరం భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత పార్లమెంట్‌ సభ్యునిగా, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా పట్టాభి  సేవలందించారు. అనంతరం 1923లో ఆం ధ్రా బ్యాంకును స్థాపించారు. రాష్ట్రం బయట పనిచేసినను తెలుగుభాషపై మమకారం కోల్పోలేదు. తాను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర, ప్రత్యు త్తరావు తెలుగులోనే జరగాలని సూచించారు. తెలు గు భాషకు, జాతికి ఎన్నో చిరస్మరణీయమైన సేవలను అందించిన పట్టాభి సీతారామయ్య 1959 డిసెంబర్‌ 17న తుది శ్వాస విడిచారు.


విద్యాభ్యాసం


పట్టాభిసీతారామయ్య ఏలూరులోని మిషన్‌ స్కూల్‌లో ప్రాఽథమిక విద్యన భ్యసించారు. అక్కడ మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసి బందరు (మచిలీపట్నం)లోని నోబుల్‌ కళాశాలలో ఎఫ్‌ఏ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. అక్కడ అప్పట్లో పనిచేస్తున్న రఘు పతి వెంకటరత్నం నాయుడుడి ఇతను ప్రియ శిష్యుడు. ఉన్నత విద్యకై మద్రాసు (నేటి చెన్నై) వెళ్లి మద్రాస్‌ క్రైస్తవ కళాశాల నుంచి బీఏ డిగ్రీని 1900 సంవత్సరంలో పూర్తి చేశారు. ఆ తరువాత అక్కడే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీసీఎం డిగ్రీ 1905లో సాధించి డాక్టర్‌ కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. అక్కడే డాక్టర్‌గా జీవితాన్ని ఆరంభించారు పట్టాభి సీతారామయ్య. బందరు జీవితం పట్టాభిని బాగా తీర్చిదిద్దింది. చదువు పూర్తయిన తర్వాత బందరులో డాక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే లాభదాయకమైన తన సంపాదన వదులుకొని గాంధీజీచే ప్రభావితుడై బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పట్టాభిసీతారామయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పట్టాభికి, గాంధీజీకి అతి సన్నిహితంగా ఉండేవారు. 1939లో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి అతివాద అభ్యర్థి అయిన సుభాష్‌చం ద్రబోస్‌కు వ్యతిరేకంగా గాంధీ అభిమతానికి దగ్గరైన వాడిగా పట్టాభిని పోటీలో నిలబెట్టారు. అయితే నేతాజీకి పెరుగుతున్న ప్రాబల్యం, పట్టాభి స్వాతంత్ర్యా నంతరం తమిళ ఆధిపత్యమున్న కొన్ని జిల్లాలను భావి తెలుగు రాష్ట్రంలో కలపటానికి మద్దతు ఇస్తున్నారన్న భావన ఈయన ఓటమికి కారణమైంది.


ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి కృషి


తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పట్టాభిసీతారామయ్య ఎంతగానో కృషిచేశారు. పట్టాభి చొరవతోనే ఆంధ్రరాష్ట్రోద్యమానికి అంకురా ర్పణ 1908లో బందరులో జరిగింది. ఈ సమా వేశంలో తెలుగు జిల్లాల ప్రముఖులందరూ హాజరై ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి చర్చించారు. ఆ తరువాతనే 1913లో బాపట్లలో తొలిఆంధ్ర మహాసభ జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత గురించి పట్టాభి ఆంగ్లంలో ఒక గ్రఽంఽథమే రచించారు. పట్టాభి కృషి వల్లే 1920లో కాంగ్రెస్‌ పార్టీ ఆంరఽధ రాష్ట్ర ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదించింది.


వ్యాపారంలో..


పట్టాభిసీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించారు. 1923లో ఆంధ్రాబ్యాంకు స్థాపించగా, ఆ తరువాత ఆంధ్రా ఇన్యూరెన్స్‌ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు , కృష్ణా కోఆపరేటివ్‌ బ్యాంకు మొదలగునవి ఉన్నాయి. ఆంధ్రా బ్యాంకు ద్వారా వ్యవసాయదారు లకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటునం దించారు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ఆనాడే ఆయన పోత్రహించారు.


మంచి గ్రంథకర్తగా..


 పట్టాభి రచించిన గ్రంథాల్లో కాంగ్రెస్‌ చరిత్ర  ప్రధానమైనది. సుమారు 1600 పుటల కాంగ్రెస్‌ చరిత్ర కేవలం రెండు మాసాలులో పూర్తిచేశారు. అందులోనూ దాన్ని ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ. కేవలం తన జ్ఞాపక శక్తితోనే ఆ గ్రంథం రాసి సంచలనం సృష్టించారు. గ్రంఽథ కర్తగా ఆయన పంజాబు వధలు, ఖద్దరు, స్వరాజ్యం, భారత జాతీయ విద్య, మన నేత పరిశ్రమ వంటి పుస్తకా లను రచించారు. విలియం టారెన్స్‌ రాసిన ఎంపైర్‌ ఇన్‌ ఆసియా అనే గ్రంథాన్ని తెలుగులోకి పట్టాభి సీతారామయ్య అనువదించారు.

పాత్రికేయ వృత్తిలో రాణింపు


1919లో మచిలీపట్నం నుంచి వచ్చే జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను ఆయన స్థాపించారు. ఆ కాలంలో ఆంధ్ర, మద్రాస్‌ రాష్ట్రాల లో ఆంధ్రుల సంపాదకత్వంలో వెలువడే ఆంగ్ల పత్రికలు లేవు. ఆ కొరత తీర్చటానికి పట్టాభి సీతారామయ్య  జన్మభూమి పత్రికను స్థాపిం చారు. ఆ తరువాత పట్టాభి సీతారామయ్య, కొంపెల్ల హనుమంతరావు, ముట్నూరు కృష్ణారావు కలిసి 1920లో కృష్ణాపత్రికను స్థాపించారు.

Updated Date - 2022-08-10T05:44:17+05:30 IST