దేశభక్తిని పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-13T06:43:44+05:30 IST

విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవి ద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ అన్నారు.

దేశభక్తిని పెంపొందించుకోవాలి
దివాన్‌చెరువు సెంటర్లో మానవహారం నిర్వహిస్త్ను గైట్‌ విద్యార్థులు

  • నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ అశోక్‌
  • ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీలు
  • పలుచోట్ల మానవహారాలు, స్వతంత్ర యోధుల వేషధారణ

దివాన్‌చెరువు, ఆగస్టు 12: విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవి ద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పలుచోట్ల జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. నన్నయ వర్శిటీలో రిజిస్ర్టార్‌ అశోక్‌, ఓఎస్‌డీ ఆచార్య ఎస్‌.టేకి హాజరై జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ఎంపీఈడీ మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహిస్తూ ర్యాలీని కొనసాగించారు. అనంతరం ఓఎస్‌డీ మాట్లాడుతూ దేశా నికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయులను స్మరించుకోవాలన్నారు. కార్య క్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గైట్‌ కళాశాలలో.. గైట్‌ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో జాతీ య జెండాలతో దివాన్‌చెరువు జంక్షన్‌లో మానవహారం, గ్రామంలో ర్యాలీ చే శారు. అంతకుముందు కళాశాల వద్ద త్రివర్ణ పతాకాలతో ర్యాలీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పీఎంఎంఎస్‌ శర్మ, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌.లీలావతి, గ్రామ కార్యదర్శి ఎ.సత్తిరాజు, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో వైడీ శివప్రసాద్‌, డీన్‌ శ్రీనివా సరావు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-13T06:43:44+05:30 IST