దేశభక్తిని నలుదిశలా వ్యాపింపచేయాలి

ABN , First Publish Date - 2022-08-12T05:10:14+05:30 IST

దేశం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా భారతీయులందరు దేశభక్తిని నలుదిశలా వ్యాపింప జేయాలని రెండవ అదనపు జిల్లా జడ్జి పి.భాస్కర రావు పిలుపునిచ్చారు.

దేశభక్తిని నలుదిశలా వ్యాపింపచేయాలి
వాల్మీకిపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 11:దేశం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న  సందర్భంగా భారతీయులందరు దేశభక్తిని నలుదిశలా  వ్యాపింప జేయాలని రెండవ అదనపు జిల్లా జడ్జి పి.భాస్కర రావు పిలుపునిచ్చారు. ఆజాది కా అమృ తోత్సవంలో భాగంగా గురువారం స్థానిక బీటీ కళాశాల ఆఽధ్వ ర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సెకండ్‌ ఏడేజే భాస్క రరావు, ఆర్డీవో మురళి మాట్లాడుతూ మదనపల్లెలో శుక్రవా రం నిర్వహించనున్న గొప్ప ర్యాలీలో ప్రజలందరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మద నపల్లెలో ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని సూచించారు. అంతకు ముందు  కార్యక్రమానికి విచ్చేసిని అతిథులకు ఎన్‌సీసీ విద్యారులు గౌరవ వందనం చేశారు. స్వాతంత్య్ర పోరాట యోధుల వేషధారణలో వచ్చిన విద్యార్థులు సభికులను ఆకట్టుకున్నారు. 


 సీఆర్‌పీఎఫ్‌ బలగాల తిరంగా ర్యాలీ 

పీలేరు, ఆగస్టు 11: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా గురువారం పీలేరులోని విద్యా ర్థులతో కలిసి కలికిరిలోని సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తిరంగా ర్యాలీ నిర్వహించారు. కలికిరి నుంచి పీలేరుకు చేరుకు న్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది జాతీయ జెండాలు చేతబూని నాలుగు రోడ్ల కూడలికి చేరుకు న్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి ‘భారత్‌ మాతా కీ జై, జై జవాన్‌, జైకిసాన్‌’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఆర్‌పీ ఎఫ్‌ కలికిరి యూనిట్‌ అసిస్టెంట్‌ కమాం డెంట్‌ రవికుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ పి.ప్రద్నా, ఏఎస్‌ఐ జాఫర్‌ ఖాన్‌, హెచ్‌సీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

వాల్మీకిపురంలో: వాల్మీకిపురంలో గురువారం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు  ఘనంగా నిర్వహించారు. స్థానిక జడ్పీ బాలి కోన్న త పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పట్టణ పురవీధులలో ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ స్వాతంత్య్ర సమర యోధులకు జోహార్లు అర్పించా రు. ఈసందర్భంగా విద్యార్థినులు వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేయాలని  పిలుపునిచ్చారు. అనం తరం స్థానిక పాతబస్టాండ్‌ నందు గల జాతి పిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు శోభారాణి, అనురాధ, జ్యోష్న, పుష్పలత, ఫర్హానా, వసుంధర, తాజున్‌, విద్యార్థులు పాల్గొన్నారు. 

గుర్రంకొండలో:ఆజాది కా అమృత్‌ మహోత్సవాల లో భాగంగా అధికా రులు, విద్యార్థులు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోట నుంచి వేలా దిగా విద్యార్థులతో కలిసి బ స్టాండు వరకు ర్యాలీచేసి మానవహారం నిర్వ హించారు.  ప్రతి ఒకరు ఇళ్లపై జాతీయ జెండాను ఎగుర వేయాలని కోరారు. కార్యక్రమంలో డీపీవో నాగరాజు, డీఎల్‌పీవో నారా యణ, తహశీల్దార్‌ కృష్ణమోహన్‌, ఎంపీడీవో వెంక టేశులు, కార్యదర్శులు మణికుమార్‌, నిస్సార్‌, ఆర్‌ఐ చంద్రశేఖర్‌, నాయకులు ముక్తార్‌, జమీర్‌, జయచం ద్రారెడ్డి, శేషాద్రినాయుడు, పురుషోత్తంరెడ్డి, ఖదీర్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కలికిరిలో: కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచు ప్రతాపకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పట్టణం లో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ జరిగింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండు నుంచి గాంధీ సర్కిల్‌ వరకు బ్యాం డు వాయిద్యాలతో జాతీయ జెండాలు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, స్థానిక పోలీ సులు, పలు విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. కాగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు కార్యాలయాలపై జాతీయ జెండాలు ఆవిష్కరించారు. 

ములకలచెరువులో: మండలంలోని పర్తికోటలో గురువారం ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి ఎంపీడీవో రమేష్‌బా బు, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఏపీఎం హరినాధ్‌, సర్పంచ్‌ మనోహరమ్మ జాతీయ పతాకాలతో గ్రా మంలో ర్యాలీ చేపట్టారు. అలాగే దేవళచెరువులో సర్పంచ్‌ ప్రభావతమ్మ అధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.  కార్యక్రమాల్లో నాయకులు చక్రపాణినాయుడు, నాగిరెడ్డి, సంఘమిత్రలు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-12T05:10:14+05:30 IST