పాఠశాల స్థాయి నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలి

ABN , First Publish Date - 2022-08-07T06:02:23+05:30 IST

పాఠశాల స్థాయి నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలి

పాఠశాల స్థాయి నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలి
జాతీయ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తున్న ఎన్‌ఎ్‌సజీ కమెండోలు, విద్యార్థులు

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 6: విద్యార్థులు పాఠశాల స్థాయినుంచే దేశ భక్తిని అలవర్చుకొని ఉత్తమ పౌరులగా ఎదగాలని నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ మేజర్‌ అక్షయ్‌ గైక్వాడ్‌ అన్నారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఎన్‌ఎ్‌సజీ కమెండోల బృందం శనివారం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఆకలింపు చేసుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు పొగాకు సురేష్‌ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 10 నుంచి 22 వరకు భారత స్వాంతంత్య్ర వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T06:02:23+05:30 IST