పశ్చిమ గోదావరి: దేశభక్తి అంటే ఎవరి పని వారు చేయడమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏలూరులో సీఆర్ రెడ్డి కాలేజ్ 75 వసంతాల వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అభ్యుదయ పథంలో నడపాలంటే మంచి లక్షణాలు ఉండడం అవసరమన్నారు. రాజకీయాల్లో దురదృష్టకర పోకడలు వస్తున్నాయన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే శక్తివంతమైన దేశంగా మారుతుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధే లక్ష్యంగా విద్య ఉండాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
ఇవి కూడా చదవండి