Advertisement
Advertisement
Abn logo
Advertisement

పటిశప్త

పొరుగింటి పండగ రుచులు

సంక్రాంతి పండగ అనగానే ఇంటి ముందు రంగవల్లులు, పతంగుల రెపరెపలతో పాటు, రకరకాల పిండి వంటలు ఘుమఘుమలాడతాయి. బొబ్బట్లు, సకినాలు నోరూరిస్తాయి. అయితే ఈసారి వాటితో పాటు వివిధ రాష్ట్రాల్లో పండగ రోజున చేసుకునే కొన్ని ప్రత్యేక వంటలను ట్రై చేయండి. వాటి తయారీ విశేషాలు ఇవి...


కావలసినవి: బొంబాయి రవ్వ - పావుకేజీ, మైదా - 400 గ్రా, పంచదార 200గ్రా, కోవా - 300గ్రా, నూనె - సరిపడా, పాలు - ఒక లీటరు.


తయారీ విధానం: ముందుగా పాలను బాగా మరిగించాలి. పాలు చిక్కగా అవుతున్న సమయంలో కోవా, కొద్దిగా పంచదార వేసి చిక్కటి పేస్టులా అయ్యేలా చేసుకోవాలి.  మరొక పాత్రలో మైదా పిండి తీసుకుని అందులో రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మిగిలిన పంచదార వేయాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక కొద్దిగా నూనె వేసుకుంటూ రవ్వ, మైదా పిండి మిశ్రమాన్ని దోశలా పోయాలి.  తరువాత చిక్కటి పేస్టులా చేసుకున్న కోవా మిశ్రమాన్ని పైన వేసి రోల్‌లా చుట్టాలి. గోధుమరంగులోకి మారే వరకు కాల్చుకుని సర్వ్‌ చేసుకోవాలి.


ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)గోన్‌ అవాల్‌
Advertisement

నవ్య మరిన్ని