ఐసొలేషన్‌లో రోగుల అవస్థలు

ABN , First Publish Date - 2020-07-03T10:42:19+05:30 IST

ఏలూరు కొవిడ్‌ ఆసుపత్రి ఆశ్రంలో బాధితులకు సరైన ఆహారం అందక అల్లాడుతున్నారు. బీపీ, షుగర్‌, గుండె సంబంధిత వ్యాధులు

ఐసొలేషన్‌లో రోగుల అవస్థలు

వేళకు అందని పౌష్టికాహారం.. వైద్య సేవలు


ఏలూరు టూ టౌన్‌, జూలై 2 : ఏలూరు కొవిడ్‌ ఆసుపత్రి ఆశ్రంలో బాధితులకు సరైన ఆహారం అందక అల్లాడుతున్నారు. బీపీ, షుగర్‌, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారూ ఉన్నారు. వైరస్‌ సోకి చికిత్స పొందుతున్న చాలా మంది అక్కడ అందుతున్న వైద్య సేవలపై పెదవి విరుస్తున్నారు. రోగులను పట్టించుకోవ డం లేదని, సిబ్బంది సైతం భౌతిక దూరం పాటిస్తూ వివక్ష చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయిన వారెవరూ తోడులేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారంతా మానసికంగా కుంగిపోతున్నారు.


సుమారు 650 మంది కరోనా పేషెంట్లు ఉన్నారు. వారికి సమయానికి ఆహారం, మందులు అందడం లేదుంటూ గగ్గోలు పెడు తున్నారు. తమ కుటుంబసభ్యులు, బంధువులకు ఇదం తా చెప్పుకుని బాధపడుతున్నారు. కరోనా అంతకంతకు విజృంభిస్తున్న సమయంలో కొవిడ్‌ ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదంటూ బాధితులు వా పోతున్నారని సీపీఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌ అన్నారు. టిఫిన్‌ ఉదయం పది గంటల సమయంలో పెడుతున్నారని, మధ్యాహ్నం భోజనం మూడు గంటలకు పెడుతున్నారని షుగర్‌ వ్యాధిగ్రస్తులు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. మంచినీరు ఉదయం ఒక లీ టరు, మధ్యాహ్నం ఒకలీటరు మాత్రమే ఇస్తున్నారన్నారు. వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభు త్వం రోగుల అవస్థలను పట్టించుకోవాలన్నారు.

Updated Date - 2020-07-03T10:42:19+05:30 IST