రోగులపై నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2020-08-08T08:38:46+05:30 IST

ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ప్రతి రోగికి ఆలస్య చేయకుండా తక్ష ణం చికిత్స అందించాలని, ఏమాత్రమూ నిర్లక్ష్యం ..

రోగులపై నిర్లక్ష్యం తగదు

వైద్యులకు కలెక్టర్‌ సూచన


కదిరి, ఆగస్టు 7 : ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ప్రతి రోగికి ఆలస్య చేయకుండా తక్ష ణం చికిత్స అందించాలని, ఏమాత్రమూ నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్‌ గంధం చంద్రుడు వైద్యులను ఆదేశించారు.  పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్‌ బాధితులను శుక్రవా రం ఆయన పరామర్శించారు.  సమస్యలనడిగి తెలుసుకున్నారు.   చాలా మంది  భోజనం సరిగా అందడం లేదని చెప్పారు. దీంతో కలెక్టర్‌  మాట్లాడుతూ  కరోనా బాఽధితులకు  ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు.   ప్రతి రోజు నిర్ధిష్ట సమయానికి ఆహారం అందించాలన్నారు.   వైద్యశాలలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.


   సీసీ కెమెరాలు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం  కలెక్టర్‌  జాయింట్‌ కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తిప్పేస్వామినాయక్‌, ఆర్‌డీఓ రామసుబ్బయ్య, తహసీల్దార్‌ మారుతి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీలతో   ఆర్‌అండ్‌బీ బంగ్లాలో   సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగుల పట్ల తీసుకుంటున్న చర్యలు సంతృప్తి కరంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. 

Updated Date - 2020-08-08T08:38:46+05:30 IST