Viral Video: గుండెపోటుతో డాక్టర్ ఎదురుగానే కుప్ప కూలిన వ్యక్తి.. అతడిని డాక్టర్ ఎలా కాపాడారంటే..

ABN , First Publish Date - 2022-09-06T20:09:32+05:30 IST

డాక్టర్‌ దగ్గరకు చికిత్స కోసం వెళ్లిన ఒక రోగి ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చుని ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు

Viral Video: గుండెపోటుతో డాక్టర్ ఎదురుగానే కుప్ప కూలిన వ్యక్తి.. అతడిని డాక్టర్ ఎలా కాపాడారంటే..

డాక్టర్‌ దగ్గరకు చికిత్స కోసం వెళ్లిన ఒక రోగి ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చుని ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన డాక్టర్‌ సీపీఆర్‌ (CPR) ద్వారా ఆ రోగి ప్రాణాలు కాపాడారు. మహారాష్ట్రలోని ఓ హాస్పిటల్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral Video) అయింది. ఆ డాక్టర్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇది కూడా చదవండి..

Virginity Test: కొత్త పెళ్లి కూతురికి కన్యత్వ పరీక్ష.. ఆమె ఫెయిల్ అయిందని రూ.10 లక్షలు అడిగిన అత్తమామలు.. చివరకు..


కొల్హాపూర్‌కు చెందిన డాక్టర్‌ అర్జున్ అడ్నాయక్ వద్దకు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఒక రోగి వచ్చాడు. డాక్టర్‌ ఎదురుగా కుర్చీలో కూర్చొన్న ఆ వ్యక్తికి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను కుర్చీలో కూర్చుని స్పృహ తప్పాడు. రోగి పరిస్థితిని గమనించిన డాక్టర్ వెంటనే పరిగెత్తుకుంటూ రోగి వద్దకు వెళ్లారు. తన చేతితో రోగి ఛాతిపై తడుతూ సీపీఆర్‌ చేశారు. కొంత సేపటికి ఆ వ్యక్తి తిరిగి సాధారణ స్థితికి వచ్చాడు. 


అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ డాక్టర్‌ స్పందించి రోగిని కాపాడిన తీరును ప్రశంసించారు. డాక్టర్‌ అర్జున్ అడ్నాయక్ నెంబర్ వన్ కార్డియాలజిస్ట్ అని చాలా మంది కామెంట్లు చేశారు. 

Updated Date - 2022-09-06T20:09:32+05:30 IST