ప్రయాణికులకు పాత్‌వే ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-06-27T04:55:17+05:30 IST

ఎర్రగుంట్ల జంక్షన్‌ కేంద్రంలో పాత్‌వే లేకపోవడంతో ప్రయాణికులు అనేక రకాల ఇక్కట్లకు గురవుతున్నారు. ఇందులో దివ్యాంగులు, వృద్ధులు, కీళ్ల మార్పిడి, ఎముకల సర్జరీ చేయించుకున్న వారి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి.

ప్రయాణికులకు పాత్‌వే ఇక్కట్లు
ఫ్లాట్‌ఫారం మారుతున్న ప్రయాణికులు

1వ ఫ్లాట్‌ఫారం నుంచి 2వ ఫ్లాట్‌ఫారం వెళ్లేందుకు వృద్ధులకు నరకం 

వికలాంగుల పరిస్థితి పెరుమాళ్లకే.... 

ప్రయాణికులకు భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం 

ఉన్న పాత్‌వే పీకేశారు 

మొండిచేయి చూపించారు.

 సాధారణంగా ప్రయాణికులు  రైలు కోసం 

నిరీక్షించేందుకు, రైలు ఎక్కేందుకు వెలపలికి వెళ్లేందుకు ప్లాట్‌ఫారం ఉంటుంది. అంతేకాకుండా ఒక ప్లాట్‌ ఫారం నుంచి మరొక ప్లాట్‌ ఫారానికి వెళ్లేందుకు ప్రత్యేకించి పాత్‌ ఉంటుంది. అయితే ఇక్కడకు వచ్చే రైళ్లల్లో ఒక్కో రైలు ఒక్కో ప్లాట్‌ ఫారంపైకి వస్తుంది. కాగా అత్యవసర సమయాల్లో ముందుగా కేటయించిన ప్లాట్‌ ఫారం కాకుండా మరొక ప్లాట్‌ ఫారంపైకి వస్తుంటాయి. ఈ విషయాన్ని పది నిముషాల ముందు ప్రకటిస్తుంటారు. దీంతో ప్రయాణికులు ప్లాట్‌ఫారం మారాలంటే గగనమైపోతుంటోంది. ప్రస్తుతం ఎర్రగుంట్ల జంక్షన్‌ కేంద్రం. అయినా పాత్‌వే లేకపోవడంతో ప్రయాణికులు అనేక రకాల ఇక్కట్లకు గురవుతుంటారు. ఇందులో దివ్యాంగులు, వృద్ధులు, కీళ్ల మార్పిడి, ఎముకల సర్జరీ చేయించుకున్న వారి పరిస్థితు లు ఘోరంగా ఉంటాయి. ఈ విషయంలో రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఉన్న పాత్‌వే తొలగించారు. కొత్త పాత్‌వే నిర్మిం చడంలో అలసత్వం వహిస్తున్నారు. వివరాల్లోకెళితే....

ఎర్రగుంట్ల, జూన్‌ 26: ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో 1వ ఫ్లాట్‌ ఫారం నంచి రెండో ప్లాట్‌ఫారంకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ముంబై, హైదరాబాదు, హుబ్లీ వెళ్లే ప్రయాణికుల రైళ్లన్నీ రెండో ఫ్లాట్‌ఫారంపైకి వస్తాయి. కడప వైపు వెళ్లేరైళ్లన్నీ 1వ ఫ్లాట్‌ఫారంపైకి వస్తున్నాయి. ప్రొద్దుటూరు వైపు నుంచి వచ్చే ప్రయాణికులు రెండో ఫ్లాట్‌ఫారంపై వెళ్లాలంటే తప్పనిసరిగా ట్రాక్‌ దాటాల్సిందే. రైల్వేస్టేషన్‌ పట్టణానికి మధ్యలో ఉండడంతో వేలాది మం ది అటు, ఇటు నడక సాగిస్తూ పనులు చేసుకుంటుంటారు. 

ఉన్నది పీకేశారు...

 ఓ పర్యాయం ఫ్లాట్‌ఫారం పొడవును పెంచే నేపథ్యంలో జీఎం పర్యటన సందర్భంగా ఉన్న పాత్‌ వే, 1, 2వ ఫ్లాట్‌ ఫారాలను కలుపుతూ వేసిన పాత్‌వే (ప్రయాణికులు నడిచే దారి)ని తొలగించారు. రెండేళ్లవుతున్నా ఇప్పటికీ దాన్ని నిర్మించలేదు. డీఆర్‌ఎం స్వయంగా ఆదేశించినా స్థా నిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురితమైనా, ఇటీవల డీఆర్‌ఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించడంలో రైల్వేశాఖ ఎప్పుడూ ముందుంటుందనే విష యాన్ని తుంగలో తొక్కుతున్నారు. ఈ స్టేషన్‌కు సంబం ధించిన ఏ పనినీ సక్రమంగా చేయడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వికలాంగులకు, వృద్ధులకు నరకమే...

పాత్‌వే లేకపోవడంతో వికలాంగులు, వృద్ధులు నరకం అనుభవిస్తున్నారు. చిన్నపిల్లలు, భారీ లగేజితో దూరప్రాం తాలకు వెళ్లే వారి పరిస్థితి మరీ దారుణంగా వుంది. ట్రాక్‌ మధ్యలో కంకరరాళ్లు దాటుకుని వెళ్లలేక వృద్ధులు నరకమ నుభవిస్తున్నారు. ఊత కర్రసాయంతో చాలా ఇబ్బందులు పడుతూ గమ్యం చేరుకుంటున్నారు. ఇక హైదరాబాదు, చెన్నై, తిరుపతి లాంటి ఆస్పత్రులకు వెళ్లి వచ్చే వికలాంగుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. కనీసం వీల్‌ఛైర్‌లో వెళ్లేందుకు కూడా వీళ్లేదు.

ట్రాక్‌మధ్యలో కంకరరాళ్లలో వారు పడు తున్న అవస్థలు చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రిళ్లు చీక ట్లో వారిని ఇరువైపులా పట్టుకుని ఎంతో ఇబ్బంది పడు తూ ట్రాక్‌ను దాటుకుంటుంటారు. ట్రాక్‌ను దాటే సమ యంలో ఏదైనా రైలు వస్తే ఇక అంతే. మధ్యలోనే భయం తో ఆగిపోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రయాణికులు ఇన్ని అగచాట్లు పడుతున్నా సంబం ధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి 1, 2 ఫ్లాట్‌ఫారాలను కలుపుతూ వెంటనే పాత్‌వేని నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 



Updated Date - 2022-06-27T04:55:17+05:30 IST