Jun 30 2021 @ 01:50AM

నలుగురు స్టంట్‌ డైరెక్టర్లతో పఠాన్‌ పోరాటం

షారూఖ్‌ఖాన్‌ గూఢచారి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్‌’. ఒళ్లు గగుర్పొడిచే భారీ పోరాట ఘట్టాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నలుగురు టాప్‌ యాక్షన్‌ స్టంట్‌ డైరెక్టర్‌లను తీసుకోవాలని భావిస్తున్నారట నిర్మాత ఆదిత్యాచోప్రా. అలాగే వరల్డ్‌ బెస్ట్‌ స్టంట్‌ ఆర్టిస్ట్‌లను తీసుకోవాలనుకుంటున్నారట. ‘మ్యాడ్‌మాక్స్‌’, ‘ఎవెంజర్స్‌’ చిత్రాలకు యాక్షన్‌ సీక్వెన్స్‌ రూపొందించిన  ఫేమస్‌ స్టంట్‌ ఆర్టిస్ట్‌ క్రెయిగ్‌ మాక్‌రేను ఎంపిక చేశారట. ఇప్పటికే ఆయన తన బృందంతో ముంబైలోని ‘పఠాన్‌’ సెట్‌లో అడుగుపెట్టారట. క్రెయిగ్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌  సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇంకో ముగ్గురు స్టంట్‌ డైరెక్టర్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకోన్‌ కథానాయిక. జాన్‌ అబ్రహం కీలక పాత్రలో కనిపించనున్నారు.


Bollywoodమరిన్ని...