Advertisement
Advertisement
Abn logo
Advertisement

దారుణం.. పచ్చని పొలాల్లో షాకింగ్ సీన్.. కర్రతో కొట్టేందుకు వస్తుంటే ప్రాణభయంతో పరుగులు తీసిన మహిళ.. అసలు కథేంటంటే..

రాజస్థాన్‌లోని భిల్వార నగరంలో ఒక భూవివాదంలో ఒక మహిళని ఆమె బంధువులు నిర్దాక్షిణ్యంగా చితకబాదారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


భిల్వార నగరం సమీపంలో ముండేతి గ్రామానికి లాదు లాల్‌కి కొన్ని భూములు, పొలాలున్నాయి. లాదు లాల్‌కి కొడుకులు లేక పోవడంతో అతని కూతురు రాంప్యారీనే పొలాల పనులు చూసుకునేది. ఇదిలా ఉండగా.. లాదు లాల్ సోదరలైన రాంబక్ష్, కాలు, నంద్రామ్ అనే ముగ్గురు వ్యక్తులు ఆ భూములు తమకే సొంతమని గొడవకుదిగారు. ఒకరోజు ఆ ముగ్గురూ లాదు లాల్‌ భూములను కబ్జా చేశారు. 


లాదులాల్‌కు కొడుకులు లేరు కాబట్టి కూతురికి భూములపై హక్కులేదని వాదించారు. వారిని లాదు లాల్, అతని కుమార్తె రాంప్యారీ ఎదిరించారు. గొడవ పెద్దదై మాట మాట పెరిగింది. ఆ గొడవలో లాదు లాల్‌ని పక్కకునెట్టి రాంప్యారీని చితకబాదారు. ఇదంతా ఇరుగుపొరుగువారు వీడియో తీశారు. రాంప్యారీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో ఉంది. రాంప్యారీని కొట్టినందుకు ఆమె బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీ ఉన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement