ఊరి చివర పిక్నిక్‌కు వెళ్లిన అమ్మాయి.. అక్కడ అనుకోని ఘటన.. చివరకు ఏ స్థితిలో ఇంటికి చేరిదంటే

ABN , First Publish Date - 2021-10-11T11:22:44+05:30 IST

రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు వినీత(17, పేరు మార్చబడినది) ఒక రోజు తన తల్లిదండ్రులకు ఊరి చివర గల్తా ధామ్ అనే పిక్నిక్ స్పాట్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది...

ఊరి చివర పిక్నిక్‌కు వెళ్లిన అమ్మాయి.. అక్కడ అనుకోని ఘటన.. చివరకు ఏ స్థితిలో ఇంటికి చేరిదంటే

రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు వినీత(17, పేరు మార్చబడినది) ఒక రోజు తన తల్లిదండ్రులకు ఊరి చివర గల్తా ధామ్ అనే పిక్నిక్ స్పాట్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. వినీతకు తోడుగా తన అన్నయ్య(పెద నాన్న కొడుకు) కూడా ఉన్నాడు. వారిద్దరూ సాయంత్రం వరకు గల్తా ధామ్ అడవి అందాలు బాగా చూసి ఇక తిరుగు ప్రయాణంలో ఇంటికి బయలుదేరాలని అనుకుంటుండగా వినీతకు అనుకోని ఘటన ఎదురైంది.


వినీత తనకు ఆకలిగా ఉందని అన్నయ్యకు చెప్పింది. అతను తన వద్ద ఉన్న ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చాడు. అది తిందామని తీసుకున్న వినీత ఏదో వాసన వస్తోందని తినలేని చెప్పింది. కాదు తప్పకుండా తినాలి అని ఆమె తన అన్న బలవంతం చేశాడు. వినీతకు అనుమానం వచ్చి అది పడేసింది. దీంతో అతనికి కోపం వచ్చి వినీతను కొట్టాడు. వినీత చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో భయపడింది. ఇక చేసేదేమి లేక ఆ స్వీట్ ప్యాకెట్ తీసుకొని ఇష్టంలేకపోయిన తినింది. తిన్న కాసేపటికే కాస్త మత్తుగా అని చెప్పింది. ఆ సమయంలో వరుసకు అన్నయ్య అయిన ఆ దుర్మార్గుడు వినీత బట్టలు చింపాడు. వినీత అతడిని ఎదురించింది. కానీ అతను తన పశుబలంతో ఆమెను కొట్టాడు. ఆ తరువాత వినీతపై అత్యాచారం చేసి ఎవరికీ విషయం చెప్పొదని బెదిరించాడు.


కానీ వినీత అందరికీ చెబుతానని అతడితో అనడంతో.. అమెను మళ్లీ చితకబాది అమె చనిపోయిందని భయపడి అక్కడే వదిలి పారిపోయాడు. చాలాసేపు తరువాత వినీతకు స్పృహ వచ్చింది. అది అడివి ప్రాంతం చుట్టూ చీకటి.. వినీత భయం భయంతో రహదారి వరకు చాలా కష్టపడి చినిగిన బట్టలతో నడిచింది. రోడ్డుపై ఒక ఆటో డ్రైవర్ ఆమెను గమనించి ఏదో జరిగిందని ఊహించాడు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తానన్నాడు. కానీ వినీత ఇంటికి తీసుకెళ్లమని చెప్పడంతో ఆమెను తన ఇంటి వద్ద చేర్చాడు. 


అప్పటికే ఇంట్లో ఎదురు చూస్తున్న వినీత తల్లిదండ్రులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. వినీత తల్లి కూతురి పరిస్థితి చూసి ఏదో ఘోరం జరిగిందని అనుమానించింది. వినీత ఏడుస్తూ తన తల్లిని కౌగిలించుకొని జరిగింది చెప్పింది. ఆమె తల్లిదండ్రులు విషయం తెలిసి ఆ దుర్మార్గుడిని వదలకూడదని నిర్ణయించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వినీతకు ఆరోగ్య పరీక్షలు చేసి.. అత్యాచారం జరిగినట్లు ధృవీకరించారు. వినీత మైనర్ కావడంతో నిందితుడైన ఆమె పెదనాన్న కుమారుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Updated Date - 2021-10-11T11:22:44+05:30 IST