పార్యపుస్తకాలను తరలిస్తున్న సిబ్బంది
మనుబోలు, జూన్ 29: మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి బుధవారం మండలంలోని ఐదు కాంపెక్స్ కేంద్రాల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను తరలించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సంబంధించి మండలానికి 20,102 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. రెండు రోజుల్లోగా పాఠశాలలకు పుస్తకాలను చేరవేయనున్నట్లు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది తెలిపారు.