Abn logo
Jun 30 2020 @ 18:54PM

కరోనా మందుపై పతంజలి యూటర్న్

న్యూఢిల్లీ: కరోనాకు మందు కనుగొన్నామని సరిగ్గా వారం క్రితం హడావుడి చేసిన పతంజలి.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. కోరోనిల్ మందు కోవిడ్-19ను నయం చేస్తుందని కానీ కరోనా వైరస్‌ను నియంత్రిస్తుందని కానీ తాము ఎప్పుడూ చెప్పలేదని పతంజలి సీఈవో బాలకృష్ణ తెలిపారు. ఉత్తరాఖండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన నోటీసుపై ఆయన స్పష్టతనిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘మేము దివ్య కరోనిల్ టాబ్లెట్, దివ్య అను తైల్ అనే మందులనే తయారు చేశాము. కరోనా కిట్ అనే పేరుతో ఇప్పటికీ ఎలాంటి అమ్మకాలు జరపలేదు. అంతే కాదు కరోనాకు మందు తయారు చేశామని మేము ఎప్పుడూ చెప్పలేదు. కేవలం కొన్ని మందులను పరిశీలిస్తున్నామంతే’’ అని బాలకృష్ణ అన్నారు.


అయితే జూన్ 23వ తేదీన ‘కోరోనిల్’ అనే మందు కరోనాకు పని చేస్తుందని, ఈ మందు వాడితే కేవలం వారం రోజుల్లో కరోనా వైరస్‌ నుంచి బయటపడొచ్చని రాందేవ్ బాబా పేర్కొన్నారు. ఈ సమావేశంలో బాలకృష్ణ కూడా ఉన్నారు. అంతే కాకుండా 280 మంది రోగులపై విజయవంతంగా పరిశీలించామని వారంతా కోలుకున్నారని ఆ తర్వాత పతంజలి అధికారిక ప్రకటన చేసింది.

Advertisement
Advertisement
Advertisement