ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ రేసులో కమిన్స్!

ABN , First Publish Date - 2021-11-21T02:33:22+05:30 IST

ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి టిమ్ పైన్ అనూహ్యంగా తప్పుకోవడంతో

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ రేసులో కమిన్స్!

సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి టిమ్ పైన్ అనూహ్యంగా తప్పుకోవడంతో ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ కోసం వెతుకులాట ప్రారంభించింది. మహిళకు అసభ్యకర సందేశాలు (సెక్స్టింగ్ స్కాండల్)లో చిక్కుకున్న పైన్ నిన్న (శుక్రవారం) టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.


వచ్చే నెలలో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు పైన్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపోయింది. ఈ నేపథ్యంలో యాషెస్‌లో ఇంగ్లండ్‌కు బదులిచ్చే గట్టి నాయకుడి కోసం క్రికెట్ ఆస్ట్రేలియా వడపోత ప్రారంభించింది.


ఈ క్రమంలో బోర్డు ముందు రెండు ఆప్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో మొదటిది పాట్ కమిన్స్. ఇటీవల నిలకడగా రాణిస్తున్న ఈ యువ పేసర్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని బోర్డు భావిస్తోంది.


యాషెస్ సిరీస్‌లో జట్టును అతడైతేనే సమర్థంగా నడిపించగలడని నమ్ముతోంది. మరోవైపు, బాల్ ట్యాంపరింగ్ కేసులో చిక్కుకుని జట్టుకు దూరమై మళ్లీ వచ్చిన మాజీ సారథి స్టీవ్ స్మిత్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.


బాల్ ట్యాంపరింగ్ వివాదానికి ముందు స్మిత్ 34 టెస్టుల్లో జట్టుకు సారథ్యం వహించి 18 విజయాలు అందించాడు. అతడి విజయాల రేటు 50 శాతానికిపైగానే ఉండడంతో మళ్లీ అతడికే పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా మల్లగుల్లాలు పడుతోంది.


మరోవైపు, కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించి, స్మిత్‌ను అతడి డిప్యూటీని చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త కెప్టెన్‌ను ప్రకటించి యాషెస్ సిరీస్ కోసం జట్టును రెడీ చేయాలని పట్టుదలగా ఉంది. 

Updated Date - 2021-11-21T02:33:22+05:30 IST