‘పశువుల గూడు’ రైతుల గోడు

ABN , First Publish Date - 2021-08-02T06:27:05+05:30 IST

జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ‘మినీ గోకులాల’ పథకం కింద పశువుల షెడ్లు నిర్మించుకున్న చిన్న, సన్నకారు రైతులు బిల్లుల మంజూరు కోసం రెండేళ్ల నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

‘పశువుల గూడు’ రైతుల గోడు

రెండేళ్ల నుంచి ‘మినీ గోకులాల’ బిల్లులు చెల్లించని వైసీపీ సర్కార్‌

జిల్లా వ్యాప్తంగా  రూ.6-7 కోట్ల వరకు పెండింగ్‌

డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

మూడేళ్ల క్రితం ‘మినీ గోకులాల’ పథకాన్ని ప్రవేశపట్టిన టీడీపీ ప్రభుత్వం

యూనిట్‌ విలువలో రైతులు 10 శాతం 

భరిస్తే చాలని భరోసా

జిల్లాలో 500 షెడ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

సొంత సొమ్ముతోపాటు అప్పులు చేసి నిర్మించుకున్న రైతులు

బిల్లులు క్లియర్‌ అయ్యే సమయానికి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

అధికారంలోకి వచ్చిన వైసీపీ... 

బిల్లులను పక్కనపెట్టేసిన పాలకులు

లబోదిబోమంటున్న చిన్న, సన్నకారు రైతులు



చోడవరం, ఆగస్టు 1:

జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ‘మినీ గోకులాల’ పథకం కింద పశువుల షెడ్లు నిర్మించుకున్న చిన్న, సన్నకారు రైతులు బిల్లుల మంజూరు కోసం రెండేళ్ల నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం హయాంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం కింద రైతులు తమ వాటాగా పది శాతం సొమ్మును భరిస్తే చాలని, మిగిలిన 90 శాతాన్ని ఉపాధి  హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా వందలాది మంది రైతులు పాడి పశువుల కోసం రేకుల 

షెడ్ల నిర్మాణం చేపట్టారు. కొన్నిషెడ్ల నిర్మాణం పూర్తిచేయగా, మరికొన్ని నిర్మాణంలో వున్నప్పుడు సాధారణ ఎన్నికలు వచ్చాయి. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... ఒక్క రైతుకి కూడా బిల్లు చెల్లించలేదు. జిల్లాలో రూ.6-7 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో వున్నట్టు రైతులు, పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. 

పాడి పశువుల పెంపకంతో నికరమైన ఆదాయం వస్తుండడంతో జిల్లాలో చాలా మంది చిన్న, సన్నకారు రైతులతోపాటు వ్యవసాయ కూలీలు కూడా పశుపోషణవైపు మళ్లుతున్నారు. పశుగ్రాసం సాగు, పశువులను వుంచడానికి అందుబాటులో వున్న ఖాళీ స్థలాన్నిబట్టి పశువులను పెంచుతున్నారు. అయితే ఎక్కువ పశువులను పోషించాలన్న ఆసక్తి వున్నప్పటికీ, అందుకు తగిన స్థలం లేకపోవడంతో చాలా మంది రైతులు పరిమితంగా పాడి పశువులను సాకుతున్నారు. దీనికితోడు పాడిపశువులకు పక్కా షెడ్లు లేకపోవడంతో పూరిపాకల్లో లేదంటే ఆరుబయట వుంచుతున్నారు. ఫలితంగా ఎండ, చలి, వర్షాలు పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పశువులకు ప్రత్యేకంగా రేకుల షెడ్లు వుంటే ఈ సమస్యలు వుండవన్న ఉద్దేశంతో గత తెలుగుదేశం ‘మినీ గోకులాలు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. పాడిపరిశ్రమను ప్రోత్సహించి రైతులకు ఆర్థిక చేయూత ఇవ్వాలన్న ఉద్దేశంతో జాతీయ ఉపాధి హమీ పథకం నిధులతో షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మినీ గోకులాలను మూడు కేటగిరీలుగా విభజించి, 2018-19లో విశాఖ జిల్లాకు 500 యూనిట్లను మంజూరు చేసింది. పాడి రైతులు స్థలాలను సమకూర్చుకుంటే, ఉపాధి హామీ పథకం నిధులతో ఈ షెడ్లను నిర్మించుకోచ్చని, యూనిట్‌ విలువలో పది శాతం సొమ్మును మాత్రమే రైతులు భరిస్తే చాలని ప్రకటించింది. దీంతో వందలాది మంది చిన్న, సన్నకారు రైతులు వీటి నిర్మాణానికి ముందుకు వచ్చారు. పంచాయతీల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి, లబ్ధిదారులను గుర్తించారు. 


మూడు కేటగిరీల్లో మినీ గోకులాలు

మినీ గోకులాల నిర్మాణాన్ని ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. రెండు పశువులకు సరిపడ షెడ్‌ నిర్మాణ వ్యయం రూ.లక్ష. ఇందులో ప్రభుత్వ రూ.90 వేలు మంజూరు చేస్తుందని లబ్ధిదారుడు రూ.10 వేలు భరించాలని పశుసంవర్థక శాఖ అధికారులు చెప్పారు. అదే విధంగా నాలుగు పశువులకు అవసరమైన షెడ్‌ నిర్మాణ వ్యయం రూ.1.5 లక్షలు కాగా ప్రభుత్వం రూ.1.35 లక్షలు ఖర్చు చేస్తుంది. లబ్ధిదారుడు రూ.15 వేలు భరించాలి. ఆరు పశువులకు సరిపడ షెడ్‌ నిర్మాణ వ్యయం రూ.1.8 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.1.62 లక్షలు ఖర్చు చేస్తుంది. లబ్ధిదారుడు రూ.18 వేలు చెల్లించాలి. ఉపాధి హామీ పథకం కాబట్టి నిధులు కచ్చితంగా     ... మిగతా 6వ పేజీలో

Updated Date - 2021-08-02T06:27:05+05:30 IST