పసుపు సాగు ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-04T03:42:35+05:30 IST

అరకొరగా వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు మొదలైంది. గత కొన్ని రోజులుగా పంట పొలాల్లో కాడెద్దుల సందడి, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.

పసుపు సాగు ప్రారంభం
పసుపు కొమ్ములు వేస్తున్న కూలీలు

ఉదయగిరి రూరల్‌, జూలై 3: అరకొరగా వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు మొదలైంది. గత కొన్ని రోజులుగా పంట పొలాల్లో కాడెద్దుల సందడి, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. మండలంలోని బిజ్జంపల్లి, కృష్ణారెడ్డిపల్లి, కొత్తపల్లి, లింగంనేనిపల్లి, దేకూరుపల్లి, బండగానిపల్లి, జీ.అయ్యవారిపల్లి గ్రామాల్లో పసుపు సాగును రైతులు జోరుగా చేపడుతున్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా లాభనష్టాలను చూసుకోకుండా గత ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రైతులు పసుపు సాగు చేస్తున్నారు. ఎకరా పసుపు పంట సాగుకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. గతంలో విత్తనం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే రైతులు ప్రస్తుతం వారే విత్తన నిల్వ చేపడుతున్నారు. నాణ్యత గల పసుపు పండించడంలో ఇక్కడ రైతులు దిట్ట. 

Updated Date - 2022-07-04T03:42:35+05:30 IST