Abn logo
Sep 28 2021 @ 22:30PM

పశుసంవర్ధక శాఖలో పథకాలపై సమీక్ష

బుచ్చి ప్రాంతీయ పశువైద్యశాలలో ఆ శాఖ పథకాలపై సమీక్షలో పాల్గొన్న జిల్లా అఽధికారులు

బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు 28: బుచ్చిరెడ్డిపాళెంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో మంగళవారం ఆ శాఖ ఏడీ బి.మురళీకృష్ణ అఽధ్యక్షతన జిల్లా పశుసంవర్ధక సహాయ సంచాలకులు, జిల్లా అధికార యంత్రాంగంతో ఆ శాఖలో అమలవుతున్న పథకాలపై సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్‌ బి.మహేశ్వరుడు, ఉప సంచాలకుడు డాక్టర్‌ ఎస్‌.రమేష్‌బాబు పాల్గొన్నారు. ముందుగా వారు ప్రపంచ రేబిస్‌ దినోత్సవం సందర్భంగా కుక్కలకు ఉచిత రేబిస్‌ టీకాల కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత బుచ్చి, దగదర్తి మండలాల్లో పశుసంవర్ధక శాఖ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, పథకాల ఆచరణపై అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉపసంచాలకులు డాక్టర్‌ టి.సోమయ్య మాట్లాడుతూ గాలికుంటువ్యాధి నివారణ టీకాల నియమావళి,  వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా జగనన్న పాల వెల్లువ, జీవక్రాంతి, లబ్ధిదారుల వివరాలు, ఆర్‌బీకేల పనితీరు, సబ్సిడీ ద్వారా సరఫరా చేసే  దాణా గురించి తెలియజేశారు. అనంతరం జాతీయ కృత్రిమ గర్భధారణ గురించి పశుగణాభివృద్ధి కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కోటేశ్వరరావు సమీక్షించారు. కార్యక్రమంలో రేబాల, దామరమడుగు, దగదర్తి, చెన్నూరు పశువైద్యులు జ్యోతి సురేష్‌, శివతేజారెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, డాక్టర్‌ కే. లక్ష్మీప్రసాద్‌, రెండు మండలాల సహాయ సిబ్బంది, గోపాలమిత్రలు పాల్గొన్నారు.