పశుసంపద అభివృద్ధిపై సమావేశం

ABN , First Publish Date - 2022-06-26T03:53:57+05:30 IST

ప్రాంతీయ పశు వైద్యశాల లో శనివారం ఇందుకూరుపేట, టీపీగూడూరు మండలాల పశుసంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బందితో జి

పశుసంపద అభివృద్ధిపై సమావేశం
మాట్లాడుతున్న పరమేశ్వరుడు

ఇందుకూరుపేట, జూన్‌ 25 : ప్రాంతీయ పశు వైద్యశాల లో శనివారం ఇందుకూరుపేట, టీపీగూడూరు మండలాల పశుసంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బందితో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ బి.మహేశ్వరుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అలాగే ఇందుకూరుపేట ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సమీక్ష  కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్‌ పథకం, పాడి రైతులు, గొర్రెల పెంపకదారులకు  పథకాలను అందించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు.  జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈవో డాక్టర్‌ టి.సోమయ్య పాడి పశువులలో ఆడ దూడలు పుట్టుకకు అవసరమయ్యే వీర్యకణాలు (సెక్స్‌ స్టోరెడ్‌ సెమెన్‌) గురించి సిబ్బందికి వివరించారు.  ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎల్‌డీఏ చైర్మన్‌ గొల్లపల్లి విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ పాడి రైతులకు బ్యాంకుల ద్వారా పశుకిసాన్‌ క్రెడిట్‌ కార్డులు త్వరితగతిన మంజూరు చేయుటకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.వి.సరేష్‌, పారా సిబ్బంది, డీఎల్‌డీఏ డైరెక్టర్‌ వెంకటరమణ, రెండు మండలాల వైద్యులు, ఏహెచ్‌ఏలు, గోపాల మిత్రలు  పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T03:53:57+05:30 IST