సామర్లకోట: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీఐడీ పోలీసులు విచారణ మమ్మరం చేశారు. విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రవీణ్ చక్రవర్తికి సంబంధించిన నివాసాలు, విద్యా సంస్థల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. గుంటూరు, రాజమండ్రి నుంచి సీఐడీ పోలీసులు బృందాలుగా విడిపోయి సామర్లకోటలోని ప్రవీణ్ చక్రవర్తి కాలేజీలకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే చక్రవర్తి కాలేజీల క్యాంపస్ల బయట చక్రవర్తి సొంత బౌన్సర్లు భారీగా మోహరించారు.
ఇవి కూడా చదవండి
ఆ దాడులు నాపనేపాస్టర్ ప్రవీణ్ అరాచకాలపై నోరు మెదపరేం: అయ్యన్నబాసూ.. ఏమైందీ కేసు?