ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ వార్నింగ్ !

ABN , First Publish Date - 2021-03-27T15:15:23+05:30 IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమాన ప్రయాణికులను హెచ్చరించారు.

ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ వార్నింగ్ !

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమాన ప్రయాణికులను హెచ్చరించారు. కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన వారిని 'నో-ఫ్లై' జాబితాలో చేర్చాలని విమానాశ్రయ అధికారులకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. "కరోనాపై పోరులో మనం చాలా సులువుగా గెలవగలం. కానీ, కొందరు ప్రయాణికులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం సమస్యలను సృష్టిస్తోంది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఆదేశాలు ఇవ్వబడ్డాయి." అని మంత్రి అన్నారు. "కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేశాం. కానీ, కొందరు ప్రయాణికులు వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇకపై అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. కరోనా మార్గదర్శకాలను పాటించని ప్రయాణికులను 'నో-ఫ్లై' జాబితాలో చేర్చాలని నిర్ణయించాం" అని హర్దీప్ సింగ్ పూరి చెప్పుకొచ్చారు.    

Updated Date - 2021-03-27T15:15:23+05:30 IST