నేటి నుంచి ‘రాయలసీమ’ స్పెషల్‌ రైలు

ABN , First Publish Date - 2020-06-01T09:09:32+05:30 IST

తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళ్ళే రాయలసీమ (02793) ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ రైలు సోమవారం నుంచి తిరుగుతుందని కడప

నేటి నుంచి ‘రాయలసీమ’ స్పెషల్‌ రైలు

ప్రయాణికులు గంటన్నర ముందే స్టేషన్‌కు చేరుకోవాలి

టెంపరేచర్‌ ఉంటే ప్రయాణం రద్దు

ఐడీ ప్రూఫ్‌, మాస్కు తప్పనిసరి

ఎస్‌ఎం ఎల్‌.వి.మోహన్‌రెడ్డి


కడప (ఎర్రముక్కపల్లె), మే 31 : తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళ్ళే రాయలసీమ (02793) ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ రైలు సోమవారం నుంచి తిరుగుతుందని కడప రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ ఎల్‌.వి.మోహన్‌రెడ్డి తెలిపారు. కడప రైల్వేస్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు కడప రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. అయితే గంటన్నర ముందే ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలని తెలిపారు. ప్రయాణికులకు ధర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తామని ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే ప్రయాణం రద్దు చేస్తామన్నారు. ఐడీ ప్రూఫ్‌, మాస్కులు, శానిటైజర్‌లు తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు.


ప్రయాణికులు వాటర్‌ బాటిల్‌, తినుబండరాలు తెచ్చుకోవాలన్నారు. ఏసీలో ప్రయాణించే వారు వారికి సంబంధించిన బ్లాంకెట్స్‌ తెచ్చుకోవాలన్నారు. రైల్వేశాఖ ఎటువంటి సౌకర్యాలు కల్పించదని తెలిపారు. వెయిటింగ్‌ లిస్ట్‌, ఆర్‌ఏసీ కలిగిన ప్రయాణికులను అనుమతించమని తెలిపారు. ప్లాట్‌ఫామ్‌ టికెట్స్‌ విక్రయాలు లేవు కాబట్టి ప్రయాణికులతో వచ్చిన వారిని ఎవరిని కూడా రైల్వేస్టేషన్‌లోకి అనుమతించమన్నారు. నిజామాబాద్‌ నుంచి తిరుపతి వెళ్ళే (02794) రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ నిజామాబాద్‌లో 2వ తేదీ బయలుదేరి 3వ తేదీ ఉదయం కడప రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. అలాగే 3వ తేదీ నుంచి  రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ ప్రతిరోజూ తిరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఐపీఎఫ్‌ ఎన్‌.రామ్‌, జీఆర్‌పీ ఎస్‌ఐ కె.శ్రీనివా్‌సవర్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T09:09:32+05:30 IST