Viral Video: విమానం గాలిలో ఉండగా.. లోపలికి ఇదెలా వచ్చింది.. ‘అమ్మ బాబోయ్!’ అంటూ అవాక్కయిన ప్రయాణికులు

ABN , First Publish Date - 2022-02-14T00:08:15+05:30 IST

వందల మీటర్ల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా.. ప్రయాణికులు సడన్‌గా షాక్‌కు గురయ్యారు. ఇదేంటీ! విమానంలోకి ‘ఇదెలా’ వచ్చిందంటూ చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది..

Viral Video: విమానం గాలిలో ఉండగా.. లోపలికి ఇదెలా వచ్చింది.. ‘అమ్మ బాబోయ్!’ అంటూ అవాక్కయిన ప్రయాణికులు

‘‘ఇదెలా సాధ్యమైంది.. నమ్మడానికే విచిత్రంగా ఉందే’’.. అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆశ్చర్యకర ఘటనలు ఎంతో వైరల్ అవుతుంటాయి. ఇక ‘‘విమానంలో ఎవరు ప్రయాణిస్తారు?’’ అని అడిగితే.. ఇదేం ప్రశ్న.. మనుషులు కాక మరెవరు ప్రయాణిస్తారని ఠక్కున అనేస్తాం. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే విమానంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వందల మీటర్ల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా.. ప్రయాణికులు సడన్‌గా షాక్‌కు గురయ్యారు. ఇదేంటీ! విమానంలోకి ‘ఇదెలా’ వచ్చిందంటూ చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఈ విచిత్ర ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. ఎయిర్ ఏషియాకు చెందిన విమానం.. మలేషియాలోని కౌలాలంపూర్‌ నుంచి తవావు అనే పట్టణానికి బయలుదేరింది. వందల మీటర్ల ఎత్తులో మేఘాల మధ్య దూసుకెళ్తోంది. ప్రయాణికులంతా ఆకాశంలోని అందాలను వీక్షిస్తూ సరదా సరదాగా ఉన్నారు. ఇంతలో సడన్‌గా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వెలుగుతున్న ఓ లైట్ బాక్సులో పాము కనబడింది. దీంతో ‘‘వామ్మో! పాము’’ అంటూ సమీపంలోని వారు కేకలు పెట్టడం మొదలెట్టారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక.. మిగతా ప్రయాణికులంతా కంగారుపడ్డారు.

పైలట్ లేకుండానే ప్రయాణిస్తున్న హెలికాప్టర్.. ఎందుకోసం వాడుతున్నారు, దీనికున్న ప్రత్యేకతలు ఏంటో తెలుసా..


తర్వాత విషయం తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. బతికున్న పాము విమానం లోపలికి ఎలా వచ్చిందంటూ అంతా చర్చించుకున్నారు. ప్రయాణికుల బ్యాగుల ద్వారా వచ్చిందా, లేక విమానం ఎయిర్‌పోర్టులో ఉండగా లోపలికి చొరబడిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ పాము లోనికి ఎలా వచ్చిందో ఇంకా తేల లేదు. కానీ, దాని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తకపోవడంతో అప్పుడైతే విమానంలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి చీమ కూడా దూరడానికి వీలు లేని విమానంలోకి పాము రావడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాదు సదరు గందరగోళం రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బోనులో సింహమే కదా.. ఏం చేస్తుందిలే అనుకుని తమాషా చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి..





Updated Date - 2022-02-14T00:08:15+05:30 IST