Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ఐదు దేశాల ప్రయాణికులకు Dubai విమానాల్లో నో ఎంట్రీ.. కారణం ఏంటంటే..

దుబాయ్: దుబాయ్ వచ్చే ఐదు దేశాల ప్రయాణికులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ షాక్ ఇచ్చింది. విమానాశ్రయాల వద్ద ర్యాపిడ్ పీసీఆర్ టెస్టు సౌకర్యం లేకపోవడంతో బంగ్లాదేశ్, నైజీరియా, వియత్నాం, జాంబియా, ఇండోనేషియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు దుబాయ్ విమానాల్లోకి ప్రవేశం లేదని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు సదరు ఎయిర్‌లైన తమ అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా ట్రావెల్ అప్‌డేట్‌ను పొందుపరిచింది. "బంగ్లాదేశ్, నైజీరియా, వియత్నాం, జాంబియా, ఇండోనేషియా దేశాల ఎయిర్‌పోర్టుల్లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్టింగ్ సౌకర్యం లేనందున ఆయా దేశాల ప్రయాణికులకు దుబాయ్ విమానాల్లో ఎంట్రీ లేదు" అని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రత్యేక ప్రకటన చేసింది. 


అయితే, ఎమిరేట్స్ జారీ చేసిన ప్రయాణ మార్గదర్శకాలను పాటిస్తే ఈ ఐదు దేశాల ప్రయాణికులకు దుబాయ్ వచ్చేందుకు వీలు కల్పిస్తామని పేర్కొంది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ దేశాల నుంచి దుబాయ్‌కు భారీ మొత్తంలో ప్రయాణికులు వెళ్తున్నట్లు సమాచారం. దీంతో ఈ దేశాల విమానాల టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని కేరళ, ముంబై, ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే విమానాల టికెట్ల రేట్లు భారీగా పెరిగిపోయాయని తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement