Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇలాంటి క్యాబ్ డ్రైవర్‌ను ఎక్కడా చూసుండరు.. ఒక్క మెసేజ్‌తో అందరి మనసులనూ దోచుకున్నాడుగా..!

ఒకప్పుడు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా.. వాహనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ప్రయాణం చాలా సులభతరమైంది. జస్ట్ ఫోన్ తీసుకుని ఏ ఉబరో, ఓలాలోనే ఇలా బుక్ చేయగానే.. అలా వాహనం వచ్చి వాలుతుంది. దీంతో సొంత వాహనాలు లేని వారికి ఇలాంటి యాప్‌లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. అయితే క్యాబ్ డ్రైవర్లంటే చాలా మంది భయపడతారు. కొందరు చేసిన తప్పులకు అందరినీ అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వీరందరి అనుమానాలను పటాపంచలు చేసేలా.. ఓ క్యాబ్ డ్రైవర్ వ్యవహరిస్తున్నాడు. ఒక్క మెసేజ్‌తో అందరి మనసులనూ దోచుకుంటున్నాడు... వివరాల్లోకి వెళితే..

లండన్‌కి చెందిన జెరెమీ అబాట్ అనే వ్యక్తి ఉబర్‌ క్యాబ్‌‌ను బుక్ చేసుకున్నాడు. వాహనం ఎక్కిన అతను లోపల సీటు వెనుక ఉన్న మెసేజ్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. "నాకు వినపడదు.. కాబట్టి మీరు ఏదైనా చెప్పాల్సి వస్తే, దయచేసి ఫోన్‌లో మెసేజ్ చేయండి.. లేదా కారు ఆపినప్పుడు లెటర్‌లో రాసి చూపించండి.. మీకు నచ్చిన సంగీతాన్ని ఎంజాయ్ చేయొచ్చు.. మీకు ఏం కావల్సినా బాస్‌లా అడగండి చేస్తాను. ఈ ట్రిప్‌ని మీతో పాటూ నేను కూడా ఎంజాయ్‌ చేస్తాను. ఈ రోజు నాకు చాలా మంచి రోజు. నాకు సహకరిస్తున్నందుకు ధన్యావాదాలు" అని రాసి ఉంది.

ఈ మెసేజ్ చూసిన జెరెమీ... డ్రైవర్‌ను అభినందించాడు. ఈ క్యాబ్ తనకు చాలా ప్రత్యేకమని.. ఈ ఉబర్ డ్రైవర్‌ గ్రేట్‌ హీరో అంటూ ట్యాగ్‌లైన్ జోడించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అయ్యింది. నెటిజన్లు కూడా డ్రైవర్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి డ్రైవర్లు ఉంటే ప్రయాణం.. ప్రశాంతంగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement