పుణె విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2020-11-01T01:25:16+05:30 IST

పుణె విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

పుణె విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

పుణె: పుణె విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుణె అంతర్జాతీయ విమానాశ్రయంలో 151.82 గ్రాముల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 7.89 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అక్రమంగా బంగారాన్ని రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రయాణికుడిని దుబాయ్ విమానంలో పుణె కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ట్రాలీ బ్యాగ్ యొక్క టెలిస్కోపిక్ హ్యాండిల్ కింద కొంత బంగారం దాచబడి ఉండగా, మిగిలిన బంగారాన్ని చాక్లెట్ బార్‌లో చుట్టి, ఒక రౌండ్ బ్యాండ్ బంగారాన్ని వెండితో పూసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-11-01T01:25:16+05:30 IST