Kuwait విమానాశ్రయంలో కోవిడ్ కలకలం.. విమానం దిగగానే పీసీఆర్ టెస్ట్.. ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-09-06T23:19:22+05:30 IST

కోవిడ్ మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా కువైత్‌లో విమానాల రాకపోకలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ మధ్యనే మళ్లీ విమానాశ్రయాలను తెరిచింది అక్కడి విమానాయాన శాఖ. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రయాణికులను ఇతర దేశాల నుంచి వచ్చేందుకు అనుమతులిస్తోంది. అలాగే వచ్చిన ప్రయాణికులందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడికి కోవిడ్ సోకినట్లు తేలింది. అతడి శరీరంలో డెల్టా వేరియంట్ కరోనా వైరస్ ఉందని ఫలితాలొచ్చాయి.

Kuwait విమానాశ్రయంలో కోవిడ్ కలకలం.. విమానం దిగగానే పీసీఆర్ టెస్ట్.. ట్విస్ట్ ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: కువైట్ విమానాశ్రయంలో కలకలం రేగింది. విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కోవిడ్ పాజిటివ్ తేలడంతో అధికారులంతా షాక్ తిన్నారు. కోవిడ్ మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా కువైత్‌లో విమానాల రాకపోకలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ మధ్యనే మళ్లీ విమానాశ్రయాలను తెరిచింది అక్కడి విమానాయాన శాఖ. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రయాణికులను ఇతర దేశాల నుంచి వచ్చేందుకు అనుమతులిస్తోంది. అలాగే వచ్చిన ప్రయాణికులందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం విమానాశ్రయంలో వేరే దేశాల నుంచి కువైత్ చేరుకున్న ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలైన పీసీఆర్ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఓ ప్రయాణికుడికి కోవిడ్ సోకినట్లు తేలింది. అతడి శరీరంలో డెల్టా వేరియంట్ కరోనా వైరస్ ఉందని ఫలితాలొచ్చాయి.


ఈ ఘటనపై ఎయిర్‌‌పోర్ట్‌లోని కరోనా ప్రివెన్షన్ కమిటీ ప్రధాన అధికారి డాక్టర్ ఖలీల్ అల్ జారల్లా స్పందించారు. పక్క దేశం నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కోవిడ్ సోకినట్లు గుర్తించామన్నారు. అతడిని వెంటనే క్వారంటైన్‌కు తరలించామని తెలిపారు. విదేశాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభించిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో కచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అలా చేస్తేనే కోవిడ్ మహమ్మారి తిరిగి దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోగలుగుతామని అన్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ ఓ ట్విస్ట్ ఏంటంటే.. కోవిడ్ బారిన పడిన వ్యక్తి విదేశాలకు చెందిన వ్యక్తి కాదట. కువైట్‌‌కు చెందిన వ్యక్తే ఈ మహమ్మారి బారిన పడ్డాడట. ఖలీల్ స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-06T23:19:22+05:30 IST