పీజీ వైద్య విద్యార్ధుల్ని పాస్‌ చేయండి

ABN , First Publish Date - 2020-09-17T08:40:13+05:30 IST

కరోనా కారణంగా తరగతులకు హాజరుకాలేక స్వల్ప మార్కుల తేడాతో ఫెయిల్‌ అయిన పీజీ వైద్య విద్యార్థులను

పీజీ వైద్య విద్యార్ధుల్ని పాస్‌ చేయండి

  • కరోనా కారణంగా తరగతులకు హాజరు కాలేదు
  • కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి ఈటల

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):  కరోనా కారణంగా  తరగతులకు హాజరుకాలేక స్వల్ప మార్కుల తేడాతో ఫెయిల్‌ అయిన పీజీ వైద్య విద్యార్థులను పాస్‌  చేయాలని  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను రాష్ట్ర  మంత్రి ఈటల కోరారు. కరోణా చికిత్సలో నిమగ్నమై ఉన్న ఈ విద్యార్థుల పట్ల మానవతా ధృక్పథంతో ఆలోచించి గ్రేస్‌ మార్కులు ఇచ్చి పాస్‌ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రమంత్రితో ఈటల ఫోన్‌లో మాట్లాడారు. ఇదే విషయంపై మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ డాక్టర్‌ రాకేష్‌ కుమార్‌తో కూడా మంత్రి మాట్లాడారు. ఈ పరిస్థితిని ప్రత్యేక సందర్భంగా గుర్తించాలని వారిద్దరిని  ఈటల కోరారు. కాగా, ఈ ఏడాది 1040 మంది పీజీ పరీక్షలు రాస్తే, వీరిలో 100 మంది వరకు ఫెయిల్‌ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 

Updated Date - 2020-09-17T08:40:13+05:30 IST