పర్యాటక ప్రాంతాలు వెలవెల

ABN , First Publish Date - 2022-05-16T05:24:01+05:30 IST

మండలంలోని పర్యాటక కేంద్రాలు సందర్శకులు లేక ఆదివారం వెలవెలబోయాయి.

పర్యాటక ప్రాంతాలు వెలవెల
వెలవెలబోతున్న బొర్రా గుహలు

- కానరాని సందర్శకుల సందడి

అనంతగిరి, మే 15: మండలంలోని పర్యాటక కేంద్రాలు సందర్శకులు లేక ఆదివారం వెలవెలబోయాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో బొర్రా గుహలకు  వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండవ శనివారం, ఆదివారం వరుస సెలవులు వచ్చినప్పటికీ పర్యాటకుల తాకిడి కనిపించలేదు. బొర్రా గుహలకు ఆదివారం కేవలం 1500 మంది సందర్శకులు మాత్రమే వచ్చారని, దీంతో ఏపీటీడీసీకి రూ.1.08 లక్షల మేర ఆదాయం వచ్చిందని మేనేజర్‌ గౌరీశంకర్‌ తెలిపారు. బొర్రా గుహలతో పాటు కటికి, తాడిగుడ జలపాతాల వద్ద  సైతం సందర్శకుల సందడి కనిపించలేదు. 

అరకులోయలో..

అరకులోయ: పర్యాటక కేంద్రం అరకులోయలో ఆదివారం సందర్శకుల సందడి కనిపించలేదు. పర్యాటకులు రాక పద్మాపురం గార్డెన్స్‌, గిరిజన మ్యూజియం వెలవెలబోయాయి. పర్యాటకులు స్వల్పంగా రావడంతో హోటళ్లు, రిసార్టులు ఖాళీగా కనిపించాయి. బేరాలు లేక ఆటో, కారు డ్రైవర్లు, వ్యాపారం లేక చిరు వర్తకులు నిరుత్సాహ పడ్డారు. 

Updated Date - 2022-05-16T05:24:01+05:30 IST