వైభవంగా పార్వేట ఉత్సవం

ABN , First Publish Date - 2021-01-16T05:28:26+05:30 IST

ఒంగోలు నగరంలో ప్రతి సంవత్సరం కనుమపండుగ రోజు నిర్వహించే పార్వేట ఉత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది.

వైభవంగా పార్వేట ఉత్సవం
ఒంగోలులో జరిగిన పార్వేటకు తరలివస్తున్న దేవతామూర్తులు

ఒంగోలు(కల్చరల్‌), జనవరి 15: ఒంగోలు నగరంలో ప్రతి సంవత్సరం కనుమపండుగ రోజు నిర్వహించే పార్వేట ఉత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది.  ఎన్నో దశాబ్దాలుగా గద్దలగుంటపాలెంలో నిర్వహించే ఈ ఉత్సవానికి నగరంలోని అన్ని దేవాలయాల నుంచి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఊరిగింపుగా తీసుకువచ్చారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణలు, స్వాగత ద్వారాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.  వివిధ ప్రాంతాలనుంచి వేలాదిమంది ప్రజలు పార్వేట ఉత్సవాన్ని చూడటానికి శుక్రవారం సా యంత్రం నుంచే గద్దలగుంటకు తరలివచ్చారు.  ఈ సందర్భంగా అక్కడ ఉన్న రామాలయం, అంకమ్మతల్లి దేవ స్థానం, శ్రీరాజరాజేశ్వరి దేవస్థానం మొదలైన పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా వి ద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని కుమారుడు ప్రణీత్‌రెడ్డి పాల్గొని ప్రజలకు కనుమ శుభాకాంక్షలు అందజేశారు.  స్థానిక వైసీపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.  ఇక పార్వేట సందర్భంగా రోడ్డు వెంబడి ఏర్పా టు చేసిన అనేక దుకాణాలు సైతం చిన్నా పెద్దలతో కిటకిటలాడాయి. 




Updated Date - 2021-01-16T05:28:26+05:30 IST