ఏకపాదంపల్లిలో ఘనంగా పార్వేట ఉత్సవం

ABN , First Publish Date - 2021-04-17T05:52:19+05:30 IST

మండలంలోని ఏకపాదంపల్లి గ్రామంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం పార్వేట కార్యక్రమాన్ని నిర్వహించారు

ఏకపాదంపల్లిలో ఘనంగా పార్వేట ఉత్సవం

తాడిమర్రి, ఏప్రిల్‌ 16: మండలంలోని ఏకపాదంపల్లి గ్రామంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం పార్వేట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ పొలిమేరల్లో పూజలు నిర్వహించిన అనంతరం  పార్వేట కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్థులు వలయాకారంలో ఉండగా మద్యలో కుందేలును పార్వేటకు వదిలారు. అనంతరం స్వామివారికి మళ్లీ పూజలు నిర్వహించి ఆలయం వరకు గ్రామస్థులంతా ఊరేగింపుగా వచ్చిన అన ంతరం  స్వామివారిని ఆలయంలో కొలుపు తీర్చారు.  పోలీసులు బందోబస్తు ని ర్వహించారు.


Updated Date - 2021-04-17T05:52:19+05:30 IST