తమిళ చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతున్న హీరోయిన్స్‌లో పార్వతి నాయర్ ఒకరు. ‘ఎన్నై అరిందాల్’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ మలయాళ భామ... ఆ తర్వాత ‘ఉత్తమ విలన్’, ‘మాలై నేరత్తిల్ మయక్కం’, ‘ఎంగిట్ట మోదాదే’, ‘నిమిర్’, ‘వల్లరాజా’, ‘సీతక్కాది’ వంటి చిత్రాల్లో నటిచింది. ప్రస్తుతం బాలీవుడ్ ఛాయాగ్రహకుడు కబీర్‌లాల్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘ఉన్ పార్వైయిల్’ అనే చిత్రంలో పార్వతి నాయర్ కీలక పాత్రను పోషిస్తోంది. పైగా ఈ చిత్రంలో ఈమె తొలిసారి ద్విపాత్రాభినయం చేసింది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ``సోదరిని హత్య చేసిన హంతకులను గుర్తించే ఓ అంధురాలిగా నటించాను. ఇదొక రివేంజ్ థ్రిల్లర్. ఎంతో లోతైన కథాపాత్రలో నటించడం చాలా సంతోషంగా ఉంది`` అన్నారు పార్వతి నాయర్.