Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 02 Jul 2022 17:07:32 IST

‘ఆచార్య’కు పరుచూరి రివ్యూ.. ఏం చెప్పారంటే..!(Chiranjeevi))

twitter-iconwatsapp-iconfb-icon

చిరంజీవి, (Chiranjeevi) రామ్‌చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రానికి ఆ టైటిల్‌ పెట్టకుండా ఉండుంటే బాగుండేదని  చరణ్‌తో ‘సిద్థ’ క్యారెక్టర్‌ చేయించకుండా ఉంటేనే బాగుండేదేమో’’ అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఇటీవల ‘ఆచార్య’ సినిమాను వీక్షించిన ఆయన ‘పరుచూరి పాఠాలు’ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ సినిమాపై అభిప్రాయాన్ని తెలిపారు. ఆయన ఏమన్నారో చూద్దాం... (Paruchuri Gopala krishna Review on Acharya)


‘‘1980లో ఎన్నో విప్లవ చిత్రాలు వచ్చాయి. ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి. ఒక సందర్భం వచ్చేసరికి ఆ తరహా కథలు రాయడమే తగ్గించేశారు. మరచిపోతున్న ఆ జానర్‌ను గుర్తు చేయాలనీ, మంచి కథతో మళ్లీ ఎర్ర సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకోవడం కొరటాల శివకు వచ్చిన గొప్ప ఆలోచన. దానికి చిరంజీవి అంగీకరించడంతో ‘ఆచార్య’ కార్యరూపం దాల్చింది. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో కమ్యూనిజం భావజాలం ఉన్న సినిమాలు ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. ఈ సినిమా చూశాక నా అభిప్రాయాన్ని మాత్రమే చెబుతున్నాను. అది కరెక్టో కాదో నేను చెప్పలేను. (Acharya)

ఆచార్యకు పరుచూరి రివ్యూ.. ఏం చెప్పారంటే..!(Chiranjeevi))

‘‘ఆచార్య’ సినిమా చూస్తున్నప్పుడు ‘మరో మలుపు’ చిత్రం గుర్తుకొచ్చింది. ఆ కథ సాగిన దారిలోనే ‘ఆచార్య’ కూడా తెరకెక్కింది. కథ నడిచిన తీరు చూస్తే ‘మరో మలుపు’ లాగానే అనిపించింది. కథగా చూస్తే ఇందులో తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ, కథలో ముఖ్యమైన సంఘటన.. ఎందుకు జరిగింది? ఏం జరిగింది తెలియకుండా కథను నడిపిస్తే ప్రేక్షకులు ఆయోమయంలో పడిపోతారు. ఆ ప్రభావం సినిమా విజయం మీద పడుతుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సస్పెన్స్‌, సెంటిమెంట్‌ ఒకే చోట ఇమడవు. ‘కథ జరుగుతున్నప్పుడు ముందు ఫలానా విషయం జరిగింది’ అని ఆడియన్‌కి ఓ ఐడియా వస్తుంది. అది మనం తెర మీద చూపించేయాలి. అప్పుడు ప్రేక్షకుడికి కనెక్ట్‌ అవుతుంది. లేకపోతే అది ఊహగానే మిగిలిపోతుంది. ఇలాంటి సంఘటనే గతంలో మాకు ఎదురైంది. ‘బెజవాడ బొబ్బిలి’ చిత్రానికి పని చేసినప్పుడు ఆ సినిమా క్రేజ్‌ చూసి మద్రాస్‌లో ప్రేక్షకులంతా మా చేతులు పట్టుకుని ఒకటే ప్రశంసలు. సినిమా జనాల్లోకి వెళ్లాక తీవ్రమైన దెబ్బ తగిలింది. ‘ఆచార్య’లో విషయంలోనూ అదే జరిగింది. సిద్థ పాత్ర ఫస్టాప్‌లోనే వచ్చుంటే బావుండేది. అసలు సిద్దా పాత్ర రామ్‌చరణ్‌ చేయకుండా ఓ చిన్నారి పాత్రలాగా ఉంచి 10 శాతమే సిద్ధ పాత్రకు స్కోప్‌ ఇచ్చి ఉంటే,  90 శాతం చిరంజీవిగారి భుజాన భారం పడేది. అప్పుడు సినిమా రిజల్ట్‌ ఇంకోలా ఉండేదని సీనియర్‌ రైటర్‌గా నా అభిప్రాయం. కథ, నటన, మాటలు లాంటి విషయాల్లో ఎక్కడా పేరు పెట్టేలా లేదు. ఇలాంటి కథలో చిరు స్టెప్పులు వేయకుండా ఉంటే బావుండేది. ఈ కథకు ఆచార్య’ టైటిల్‌ కరెక్ట్‌ కాదు’’ అని పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri paataalu)తెలిపారు. Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement