Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 13 Aug 2022 20:33:56 IST

Paruchuri Comments: ‘ఎఫ్‌–3’ కన్నా ‘ఎఫ్‌–2’ బెస్ట్‌

twitter-iconwatsapp-iconfb-icon

‘ఎఫ్‌ 2’()F2 చిత్రంతో కంపేర్‌ చేస్తే ‘ఎఫ్‌ 3’ (F3)బాలేదని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. గతంలో తాము చేసిన తప్పే ఇప్పుడు దర్శకుడు అనిల్‌ రావిపూడి చేశారన్న భావన కలిగిందని చెప్పారు. ఈ మేరకు ‘ఎఫ్‌–3’పై తన అభిప్రాయాన్ని ‘పరుచూరి పలుకులు’ వేదికగా తెలిపారు. (Paruchuri gopala krishna comments n F3)


‘‘ఈ మధ్యనే నేను ‘ఎఫ్‌–3’ చూశా. ‘శ్రీకట్న లీలలు’లో సినిమాకు మేము చేసిన పొరపాటే అనిల్‌ రావిపూడి ఈ సినిమా సెకెండాఫ్‌లో చేశారని అనుమానం కలిగింది. సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ ట్రాక్‌ తప్పింది. ఒక చీటింగ్‌ డ్రామాని దాదాపు 40 నిమిషాలు నడిపించారు. చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకు కోసం ఎదురుచూస్తున్నానని, ఆ కొడుక్కి ఇప్పుడు సుమారు 20 సంవత్సరాలు ఉంటాయని మురళీ శర్మ ప్రకటించడం.. డబ్బు కోసం తానే కొడుకునంటూ వెంకటేశ్‌ వెళ్లినట్టు చూపించారు. వెంకీ వయసు మనందరికీ తెలుసు. ఆయన్ని 20 ఏళ్ల కుమారుడి పాత్రలో చూపించడం అతకలేదు. వెంకటేశ్‌కి మేం ఎన్నో కథలు రాశాం. కాస్త లాజిక్‌ మిస్సైనా వెంకీ ఒప్పుకోడు. అలాంటిది ఆయన ఈ పాత్ర ఎలా అంగీకరించారో అర్థం కావడం లేదు. అలాగే తమన్నాకు మీసాలు పెట్టి అబ్బాయిలా చూపించడం, వరుణ్‌ తేజ్‌, వెన్నెల కిశోర్‌ అక్కడికి రావడం సెకండాఫ్‌లో అర్థంపర్థం లేని కామెడీలా అనిపించాయి. ద్వితీయార్ధంలో 40 నిమిషాలు ఇలా కాకుండా మరోలా చూపించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదని నా భావన. క్లైమాక్స్‌లో వరుణ్‌తేజనే మురళీ శర్మ వారసుడని, వెంకీ, తమన్నా, రాజేంద్రప్రసాద్‌ ఇతర పాత్రధారులు చెబుతారు కదా. ఆ సీన్‌ని మెయిన్‌గా తీసుకుని వరుణ్‌ని మురళీ శర్మ వారసుడిగా ప్రూవ్‌ చేసేందుకు వాళ్లందరూ నానా తంటాలు పడినట్లు డ్రామా నడిపించి ఉంటే బాగుండేదనిపించింది. డబ్బు ఉంటేనే ఆనందంగా జీవితాన్ని నడిపించగలమని చూపించకుండా ఉండాల్సింది. సునీల్‌ క్యారెక్టర్‌ డిజైన్‌ చేయడంలో కూడా పొరపాట్లు ఉన్నాయి. ఇన్ని తప్పులు ఉన్నప్పటికీ సినిమా ముందుకు వెళ్లిందంటే చివరి 20 నిమిషాల వల్లే. హీరో అంటే ఏదైనా చేయగలడు అని నిరూపించాలి. ఏం చేతకాని వాడిగా చిత్రీకరించకూడదు. క్లైమాక్స్‌లో వరుణ్‌ తేజ్‌, వెంకటేశ్‌ పాత్రలను  రియల్‌  హీరోలుగా చూపించాడు కాబట్టే సినిమా నిలబడిందని నా అభిప్రాయం. ‘ఎఫ్‌–2’లో మాదిరిగా మనసుని హత్తుకునే డ్రామా లేదు. (Paruchuri gopala krishna) 


Paruchuri Comments: ఎఫ్‌–3 కన్నా ఎఫ్‌–2 బెస్ట్‌


ఒక మాటలో చెప్పాలంటే ‘ఎఫ్‌–2’ చూసిన కళ్లతో ‘ఎఫ్‌–3’ చూేస్త బాలేదనిపించింది. కలెక్షన్స్‌ పరంగా చూసుకున్నా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు రాలేదనే నేను అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదే చిత్రం దాదాపు రూ.250 కోట్లు వసూళ్లు చేేస్త ‘ఎఫ్‌–2’తో సమానమై ఉండేది. ‘ఎఫ్‌–2’ అంత విజయం సాధించడానికి రీజన్‌ అందులో అందరికీ ఆసక్తి కలిగించే అంశం ఉండటమే! భార్యభర్తలు ఇద్దరిలో ఇంట్లో ఎవరి పెత్తనం నడవాలి అన్న కాన్సెప్ట్‌తో ఆ చిత్రం రూపొందింది. మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న గొడవలను చూపించారు. అందుకే ‘ఎఫ్‌2’కు  అందరూ కనెక్ట్‌ అయ్యారు’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement