దేశ విభజన దురదృష్టకరం

ABN , First Publish Date - 2022-08-14T05:45:26+05:30 IST

అఖండ భారతావనిని ఆంగ్లేయులు ఇష్టారాజ్యంగా ముక్కలు చేయడం దురదృష్ట కరమని జీజేపీ జిల్లా అధ్యక్షుడు మైందల రామచంద్రుడు అన్నా రు. తిరిగి అఖండ భారత్‌ తీసుకురావడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమన్నారు.

దేశ విభజన దురదృష్టకరం
ప్రదర్శన చేపడుతున్న బీజేపీ నేతలు

బీజేపీ మౌన ప్రదర్శన


వి.కోట, ఆగస్టు 13: అఖండ భారతావనిని ఆంగ్లేయులు ఇష్టారాజ్యంగా ముక్కలు చేయడం దురదృష్ట కరమని జీజేపీ జిల్లా అధ్యక్షుడు మైందల రామచంద్రుడు అన్నా రు. శనివారం వి.కోట పట్టణం ఎంజీ రోడ్డులో జాతీయ జెండాలను చేతపట్టి మౌన ప్రదర్శన చేపట్టారు. 1947 ఆగస్టు 14న తల్లి భారత్‌ను రెండు ముక్కలుగా విభజించిన దినాన్ని భయానక రోజుగా అభివర్ణించారు. ఆ రోజు దేశ విభజనను ఎందుకు అడ్డగించి అఖండ భారత్‌ను కాపాడుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఐక్యతను దెబ్బతీసి సోదర దేశమే మన శత్రువుగా మారే పరిస్థితులు ఎందుకు కల్గాయని అందుకు కారకులైన వారి తీరును ఖండించారు. తిరిగి అఖండ భారత్‌ తీసుకురావడమే  భారతీయ జనతా పార్టీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మండల  అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, ప్రభాకర్‌, మొగిలీశ్వర్‌, ఎల్లారెడ్డి, నవీన్‌కుమార్‌రాజు, నలందా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-08-14T05:45:26+05:30 IST