Abn logo
May 17 2021 @ 00:09AM

కక్షపూరిత అరెస్ట్‌లు మానుకోవాలి

 - కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ బాలవర్దన్‌గౌడ్‌

బాదేపల్లి, మే 16 : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్‌ గౌడ్‌ను పోలీసుల చేత అక్రమ అరెస్ట్‌ చేయించి బెదిరించడం విడ్డురంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ బాలవర్దన్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా మహమ్మారికి గురైన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన యుగంధర్‌గౌడ్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి అరెస్టు చేయించడాన్ని ఆయన త్రీవంగా ఖండించారు. మంత్రి కక్షపూరితంగానే బీసీ నాయ కులను, ప్రజలను ఎదగనీయకుండా చేస్తున్నారని మండిపడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరును, రోగులకు అందుతున్న సేవల గురించి మాత్రమే యుగంధర్‌గౌడ్‌ ఆరా తీశారని గుర్తు చేశారు. వెంటనే  మంత్రి నిరంజన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బాలవర్దన్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. 

Advertisement